నందమూరి బాలకృష్ణ నటించిన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “అఖండ”. ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ‘అఖండ’ను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తమన్ బాణీలు అందిస్తుండగా, సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ…
ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు ‘ పెళ్లి సందడి’ సినిమాతో నటుడుగా పూర్తి స్థాయిలో ఎంట్రీ ఇస్తున్నాడు. రోషన్, శ్రీ లీల ప్రధాన పాత్రలలో నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 15 వ తేదీన విడుదల కానుంది. గౌరీ రోనంకి దర్శకత్వం వహించారు. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా పాల్గొన్న దిల్ రాజు మాట్లాడుతూ నిజానికి ‘శతమానంభవతి’తోనే రాఘవేంద్రరావును పూర్తి స్థాయి నటుడిగా పరిచయం చేయాలనుకున్నామని,…
జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్‌ను తెలుగు సినిమా నిర్మాతలు కలిశారు. దిల్ రాజు, డీవివి దానయ్య, సునీల్ నారంగ్, బన్నీ వాసులు ఈరోజు పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యలపై నిర్మాతలు పవన్‌తో చర్చించారు. ఆన్లైన్ టికెట్ల వ్యవహారంపై గత కొన్ని రోజులుగా రగడ జరుగుతున్నది. సినిమా వ్యవహారం కాస్త రాజకీయ రంగు పులుముకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తెర దించేందుకు సినీ నిర్మాతలు రంగంలోకి దిగారు.…
టాలీవుడ్ నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, సునీల్ నారంగ్, బన్నీవాసుతో పాటు మరికొందరు కలిసి ఏపీ మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం.. పేర్నినాని మాట్లాడుతూ.. ‘నన్ను కలవాలని నిర్మాతలు నిన్న అడిగారు.. ఇండస్ట్రీకి నష్టం జరిగే సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని నాతో మాట్లాడాలి అన్నారు. ఇండస్ట్రీ అంతా ఒక్కమాటపై ఉన్నాము.. ఇదే మాట సీఎంకు చెప్పండి అని కోరారు. ఆన్లైన్ టికెట్లపై మేము అనుకూలం అని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే పోర్టల్స్…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న టాప్ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఆయన మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తిరుమలను సందర్శించారు. అక్కడ శ్రీవారిని దర్శించి, పూజా తదితర కార్యక్రమాలు కావించారు. శ్రీవారి సర్వదర్శనం అనంతరం తీర్థప్రసాదాలు, పూజారుల ఆశీస్సులు అందుకున్నారు. దిల్ రాజుతో పాటు డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ఆయన కుటుంబ సభ్యులు కూడా తిరుమలను సందర్శించారు. Read Also…
ప్రముఖ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి ఇటీవలే మీడియా ఇంటరాక్షన్‌లో తమిళ స్టార్ హీరో విజయ్‌తో తన తదుపరి ప్రాజెక్ట్ ఉంటుందని వెల్లడించిన విషయం తెలిసిందే. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుందని తెలిసిన అధికారిక ప్రకటన కోసం విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విజయ్ నటిస్తున్న తొలి ద్విభాషా చిత్రం, మొదటి స్ట్రెయిట్ తెలుగు చిత్రం…
ఏపీ మంత్రి పేర్నినాని సినీ ప్రముఖులతో నేడు సమావేశం నిర్వహించారు. చిత్ర పరిశ్రమకు చెందిన ఆదిశేషగిరిరావు, యువి క్రియేషన్స్ వంశీ, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సి. కళ్యాణ్, డివివి దానయ్య, మైత్రీ మూవీ మేకర్స్ రవి, నవీన్, పంపిణీదారులు ఎల్వీఆర్, సత్యనారాయణ, వీర్రాజు, అలంకార్ ప్రసాద్, ఒంగోలు బాబుతో పాటు పలువురు థియేటర్ల యజమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకొంది. ఓ సినిమా థియేటర్ యజమాని సినిమా టిక్కెట్…
సినిమా టికెట్ ఆన్ లైన్ అనేది తప్పని సరి వ్యవహారంగా ఎపి మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం చిత్ర ప్రముఖులతో జరిగిన సమావేశంలో సినిమా పరిశ్రమతో పాటు థియేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా సినిమా టికెట్ రేట్ సమస్య తీవ్రంగా ఉంది. ఈ సమావేశంలో ఒక ఎగ్జిబిటర్ కన్నీటి పర్యంతం అవటం సమస్య తీవ్రతను తెలియచేస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న రేట్లతో థియేటర్స్ రన్ చేయలేం అంటూ అతడు కళ్ల నీళ్లు…
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘ఎఫ్3’.. తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సీక్వెల్ చిత్రంలో ఈసారి సునీల్, అలీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడగా.. తాజాగా ‘ఎఫ్3’ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా సెట్లో జరిగిన సరదా సన్నివేశాలను ‘ట్రిపుల్ ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అంటూ వీడియో విడుదల…
విశ్వక్ సేన్ హీరోగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ “హిట్” మూవీ. గత ఏడాది ఫిబ్రవరి 20న విడుదలైన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ నచ్చడంతో హిందీ మేకర్స్ దృష్టి “హిట్”పై పడింది. ఇంకేముంది తెలుగు కాప్ థ్రిల్లర్ “హిట్” మూవీ హిందీలో రీమేక్ కానుంది. ఈ హిందీ రీమేక్ లో రాజ్ కుమార్ రావు హీరోగా కనిపించనున్నాడు. హిందీ రీమేక్ కు కూడా తెలుగు…