రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఓ భారీ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘లైగర్’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు దిల్ రాజు చేతిలో కొన్ని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఒకవైపు తమిళ స్టార్ హీరో విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లితో కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీకి సిద్ధమవుతున్నాడు. మరోవైపు మెగా పవర్ స్టార్, క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో “ఆర్సి 15” అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. నిర్మాతగా దిల్ రాజు, హీరోగా విజయ్ దేవరకొండ ఇద్దరూ పాన్ ఇండియా రేసులో ఉన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా విజయ్ దేవరకొండ వెల్లడించారు.
Read Also : ‘ప్రేమమ్’ నుంచి ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నా : విజయ్ దేవరకొండ
నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్” సాంగ్ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ “రాజు గారు ఫైటర్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని రోజులైనా, ఇంత సక్సెస్ సాధించినా కూడా ఆయన ఎప్పుడూ ఖాళీగా ఉండడు. దిల్ రాజు బ్యానర్ లోనే ఏదైనా చిన్న క్యారెక్టర్ తో లాంచ్ అవ్వాలి అనుకున్నా. కానీ కుదరలేదు. ‘కేరింత’ సినిమా ఆడిషన్స్ కు వెళ్ళాను. అప్పుడే దిల్ రాజు గారిని చూశాను. ఆ తరువాత ‘పెళ్లి చూపులు’ రిలీజ్ ను కూడా ఆయనతోనే చేయిద్దామనుకున్నాము. కానీ ఆయన హాలిడేస్ లో ఉన్నారప్పుడు. ఇక ఇప్పుడు గట్టిగా ఫిక్స్ అయ్యాము. చేస్తే మైండ్ బ్లోయింగ్ సినిమా చేయాలనుకున్నాము. అలాంటి కంటెంట్ పైనే వర్క్ చేస్తున్నాము. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను ప్రకటిస్తాము. ఖచ్చితంగా మీ మైండ్ ను బ్లో చేస్తాము” అంటూ చెప్పుకొచ్చాడు.