ఈ యేడాది ఫిబ్రవరిలో విడుదలైన ‘అల్లరి’ నరేశ్ ‘నాంది’ సినిమా ప్రేక్షకుల అభిమానాన్నే కాదు, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. న్యాయవ్యవస్థలోని లోపాలనే కాకుండా, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 211 ద్వారా ఎలాంటి న్యాయం పొందవచ్చో కూడా చెప్పిన చిత్రం ‘నాంది’. ఇదే అందరినీ ఆకట్టుకుంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో సతీశ్ వేగేశ్న ఈ సినిమాను నిర్మించారు. మూవీ విడుదలైనప్పుడే ఆ యూనిట్ ను ప్రశంసించిన ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలకు, సెలెబ్రెటీలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ పుణ్యమా అని పలువురు నెటిజన్లు తమ అభిమాన సెలెబ్రిటీలతో టచ్ లో ఉండగలుగుతున్నారు. అయితే ఈ టెక్నాలజీని కొందరు మాత్రం తప్పుగా ఉపయోగిస్తున్నారు. సెలెబ్రిటీల పేర్లతో నకిలీ ఖాతాలను సృష్టించి వారి అభిమానులను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన పేరుతో ట్విట్టర్ లో నకిలీ ఖాతాలు…
కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. ప్రైవేట్ సంస్థలు సైతం తమ సిబ్బందికి వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు సినీప్రముఖులు కూడా తమ ఆఫీస్ స్టాఫ్కు వ్యాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, మహేష్ బాబు తమ స్టాఫ్ మెంబర్స్కు ప్రత్యేకంగా కరోనా వాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తమ సిబ్బందికి మరియు తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్…
మాస్ హీరో విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా సక్సెస్ తర్వాత ఇప్పుడు ‘పాగల్’ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రముఖ నిర్మాత దిల్రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా పతాకాలపై అభిరుచి గల నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ పక్కా రొమాంటిక్ యాంగిల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమానుంచి టీజర్ , రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కరోనా కారణంగా పాగల్…
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే లక్షలు. తరువాత కోట్లు. ఇప్పుడు వందల కోట్లు! మన సినిమాల్లో క్వాలిటీ, క్రియేటివిటి కోసం దర్శకనిర్మాతలు ఎంత వెచ్చిస్తారన్నది పక్కన పెడితే… రెమ్యూనరేషన్స్ కోసం బాగానే డబ్బులు వెదజల్లుతారు! లెటెస్ట్ గా దిల్ రాజు, వంశీ పైడిపల్లి, తమిళ స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా గురించి అటువంటిదే ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం గ్లామర్ ప్రపంచంలో రెమ్యూనరేషన్స్ ఏ రేంజ్ లో ఉంటున్నాయో ఈ విషయం…
ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, చదవాలవాడ శ్రీనివాస్, యలమంచిలి రవిచంద్ ఆధ్వర్యంలో “కళామతల్లి చేదోడు” కార్యక్రమం ఈ రోజు ఉదయం ఫిల్మ్ ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా వర్కర్స్ కి, డ్రైవర్స్ కి, జూనియర్ ఆర్టిస్టులు కి, ప్రొడక్షన్ వర్కర్స్ కి సుమారు ఆరువందల మందికి నిత్యావసర వస్తువులను ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, అజయ్ కుమార్, వల్లభనేని అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యలమంచిలి రవి చంద్…
ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఒకసారి పనిచేసిన దర్శకులు కానీ హీరోలు గానీ మళ్ళీ మళ్ళీ ఆ బ్యానర్ లో పనిచేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అలా వాళ్ళను తనవైపుకు తిప్పుకుంటారు దిల్ రాజు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడికి, దిల్ రాజుకు ఉన్న అనుబంధం కూడా గట్టిదే. వరుసగా అదే బ్యానర్ లో సినిమాలు చేస్తున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 3 మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తి కాగానే మహేశ్ బాబుతో మూవీ…
దిల్ రాజు బ్యానర్ లో ఇప్పుడు దాదాపు పది చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో రెండు హిందీ రీమేక్స్ కూడా ఉన్నాయి. అలానే ఆయన చేతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి వందలాది థియేటర్లు ఉన్నాయి. ఇక ప్రతిష్ఠాత్మక చిత్రాలెన్నింటినో ఆయన పంపిణీ చేస్తుంటారు. అయితే… కరోనా పేండమిక్ సిట్యుయేషన్ లో థియేటర్లు మూతపడటంతో వాటి లీజుదారులందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. థియేటర్లు నడవకపోయినా ఎంతో కొంత మొత్తాన్ని దాని మెయిన్ టెన్స్ కు ఇవ్వాల్సి వస్తోందని అంటున్నారు.…
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్పైకి వెళ్లనుందని సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా…