‘ప్రేమమ్’ నుంచి ఆ హీరోయిన్ ని ఇష్టపడుతున్నా : విజయ్ దేవరకొండ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి హీరోగా అరంగేట్రం చేయనున్న కాలేజ్ క్యాంపస్ డ్రామా “రౌడీ బాయ్స్”. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘హుషారు’ ఫేమ్ హర్ష కనుగంటి దర్శకత్వం వహించారు. ‘రౌడీ బాయ్స్’లో యువ నటి కోమలీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తోంది. స్టార్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సౌండ్‌ట్రాక్ స్వరపరిచారు. నవంబర్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా సాంగ్ కు సంబంధించిన వేడుక రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘ప్రేమ ఆకాశం’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.
Read Also : అది మా ఉద్దేశం కాదు.. ఎన్టీవీతో యూట్యూబ్ ఛానెల్
Also Read
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
ఈ వేడుకలో భాగంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ పై తనకు ఉన్న ఇష్టాన్ని వ్యక్తపరిచారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఆశిష్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అనుపమ పరమేశ్వరన్ గురించి మాట్లాడుతూ “అను నాకు ఇంకా ‘ప్రేమమ్’లో మేరీ లాగే కల్పిస్తావు. నువ్వు ‘ప్రేమమ్’ సినిమా చేసినప్పుడు మేము పిల్లలం. అందరం ఈ అమ్మాయి ఎవరా? అనుకున్నాము. చరణ్ అన్న కూడా అడిగాడు. ఇప్పుడు నువ్వు వుమన్ అయ్యావు” అంటూ చమత్కరించారు. కానీ అను నేచురల్ గా ఉంటుందని, ఆమె స్క్రీన్ ను మెరిపిస్తుందని అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక చిత్ర బృందానికి విషెష్ తెలుపుతూ సినిమా హిట్ కావాలని కోరుకున్నారు విజయ్ దేవరకొండ.
తాజావార్తలు
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
-
Harish Rao : రాష్ట్రంలో రైతు రాజ్యం పోయి రాక్షస రాజ్యం వచ్చింది
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!