కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటిసారిగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. ఇప్పటివరకు ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. అయితే విజయ్ ఇప్పుడు నేరుగా తెలుగులోనే ఓ సినిమా చేయబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘తలపతి 67’ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాని తెలుగు, తమిళంలో ఒకేసారి చిత్రీకరించాలని నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది వేసవిలో ‘తలపతి 67’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుండగా, అలియా భట్ రాంచరణ్ పక్కన నటిస్తోంది. కాగా అలియా ఈ సినిమాతో పాటుగా పలు బాలీవుడ్ చిత్రాలతోను బిజీగా వుంది. అయితే ఈ బ్యూటీ మరోసారి రాంచరణ్ సరసన నటించనున్నట్లు సమాచారం. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, రాంచరణ్ హీరోగా ఓ పాన్ ఇండియా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ ఈరోజు నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘వకీల్ సాబ్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు అమెజాన్ ప్రైమ్ ముందుగా 14 కోట్ల రూపాయలను చెల్లించింది. అయితే తాజాగా అమెజాన్ సంస్థ దిల్ రాజుకు మరో 12 కోట్లు అదనంగా చెల్లించినట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తరువాత యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది…
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో సినిమా రానున్న విషయం తెలిసిందే. ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. రాజకీయ నేపథ్యంలో రామ్ చరణ్- శంకర్ సినిమా ఉంటుందని ప్రచారం నడుస్తుంది. పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ సినిమాపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నాలుగు భాషల నుంచి నలుగురు స్టార్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చాలా కాలమే ఎదురు చూడాల్సి వచ్చింది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన పవన్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో దిల్ రాజు కల నెరవేరినట్లయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కోర్ట్ డ్రామా ‘వకీల్ సాబ్’కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్…
తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది ‘ఐకాన్’ అని స్పష్టం చేశాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటున్నారు. అప్పటలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక…