కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తొలి తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్ట్ ను చేయబోతున్న విషయం తెలిసిందే. తాత్కాలికంగా “తలపతి 66” అనే పేరుతో పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. విజయ్ తన 65వ చిత్రం ‘బీస్ట్’ పూర్తి చేసిన తర్వాత ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం నుండి ప్రారంభమవుతుంది.
Read Also : అనంతపురంలో కూలిన 4 అంతస్థుల భవనం..
ఇదిలా ఉండగా “తలపతి 66” కథాంశం గురించి ఒక క్రేజీ బజ్ ఫిల్మ్ సర్కిల్స్‌లో తాజాగా చక్కర్లు కొడుతోంది. వంశీ రాసుకున్న ఈ సినిమా కథలో విజయ్ పాత్ర ఎరోటోమానియా అనే అరుదైన మానసిక ఆరోగ్య స్థితితో బాధపడుతుంది. ఎరోటిమేనియాతో బాధపడుతున్న వ్యక్తి ఒక ప్రముఖుడు, సంపన్నుడు లేదా ఉన్నత సామాజిక స్థానం ఉన్న వ్యక్తి తమతో గాఢంగా ప్రేమలో ఉన్నారని నమ్ముతారు. దీనిని ఎరోటిమానియాను డి క్లెరాంబాల్ట్ సిండ్రోమ్ అని కూడా అంటారు.
వంశీ పైడిపల్లి విజయ్ లాంటి టాప్ స్టార్‌ని, అతని మాస్ ఇమేజ్‌ని అటువంటి ఆఫ్‌బీట్ కథాంశంతో ఎలా హ్యాండిల్ చేసాడు ? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇక ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే.