“మహర్షి” సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర బృందానికి చాలా ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఉపరాష్ట్రపతి ప్రశంసలు సైతం అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం టాలీవుడ్ లోని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా ‘మహర్షి’ సినిమాకు గానూ రెండు నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. “మహర్షి” రెండు విభాగాలలో జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి ఉత్తమ వినోదం, రెండవది బెస్ట్ కొరియోగ్రఫీ. కొరియోగ్రాఫర్ రాజు సుందరం ఈ ఈవెంట్‌కి హాజరుకాలేకయారని తెలుస్తోంది. ఈ యాక్షన్ డ్రామా మంచి సామాజిక సందేశంతో తెరకెక్కగా, ఇందులో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. అల్లరి నరేష్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించాడు.
Read also : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గురువుకు అంకితమిచ్చిన రజినీకాంత్
