Kuwait Fire: కేరళ చేరిన 45 మంది కార్మికుల మృతదేహాలు
- కేరళ చేరిన 45 మంది కువైట్ మృతదేహాలు
- 3 దక్షిణాది రాష్ట్రాలకు డెడ్‌బాడీలు తరలింపు
- మరో 33 మంది కోలుకుంటున్నారని ఎంబసీ వెల్లడి
- బుధవారం కువైట్ అగ్నిప్రమాదంలో 49 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కువైట్ అగ్నిప్రమాదంలో మరణించిన 45 మంది భారతీయుల మృతదేహాలు కేరళకు చేరుకున్నాయి. బుధవారం కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మొత్తం 49 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. ఇక 33 మంది ఆస్పత్రి పాలయ్యారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఒకే కంపెనీకి చెందిన 176 మంది కార్మికులను అద్దె భవనంలో ఉంచారు. అయితే తెల్లవారుజామున వంటగదిలోంచి మంటలు రావడం.. అనంతరం అప్రమత్తమైన కార్మికులు తప్పించుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు, పొగ వ్యాపించడంతో ఊపిరాడక.. మెట్లపైనే సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా హుటాహుటినా కేంద్ర విదేశాంగ సహాయమంత్రిని కువైట్‌కు పంపించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: కీలక శాఖలన్నీ పవన్ కల్యాణ్‌కే.. డిప్యూటీ సీఎం సహా నాలుగు శాఖలు..
Also Read
- ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
45 మంది భారతీయ కార్మికుల మృతదేహాలను ఈ ఉదయం భారత్‌కు తిరిగి తీసుకువచ్చారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం కేరళలోని కొచ్చిలో దిగింది. మూడు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన 31 మంది కార్మికుల మృతదేహాలను అప్పగించింది. అనంతరం మిగిలిన 14 మృతదేహాలతో ఢిల్లీకి బయలుదేరింది. బాధితుల్లో కేరళకు చెందిన 23 మంది, తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన ముగ్గురు, ఒడిశాకు చెందిన ఇద్దరు, బీహార్, పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, హర్యానాలకు చెందిన ఒక్కొక్కరు ఉన్నారని భారత రాయబార కార్యాలయం తెలిపింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల కార్మికులతో సహా కొచ్చిలో అప్పగించిన మృతదేహాలను అంబులెన్స్‌లలో వారి ఇళ్లకు పంపించారు.
ప్రధాని మోడీ సూచనల మేరకు రెండ్రోజుల్లోనే మృతదేహాలు కువైట్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. విదేశాంగ సహాయమంత్రి కీర్తి వర్ధన్ సింగ్.. కువైట్ వెళ్లి అధికారులతో సంప్రదింపులు జరపడంతో వేగంగా పనులు పూర్తి చేసుకుని మృతదేహాలను భారత్‌కు తీసుకురాగలిగారు. లేదంటే కనీసం 10 రోజులైన పెట్టే అవకాశం ఉంటుంది.
కువైట్ అధికారులకు కీర్తి వర్ధన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. అన్ని పేపర్లు పూర్తి చేయడానికి అధికారులు సహకరించాలని చెప్పారు. అందుకే త్వరగా మృతదేహాలను తీసుకురాగలిగామని.. లేదంటే కనీసం 10 రోజులైన పట్టేదని చెప్పారు. మోడీ సూచనల మేరకు అధికారులు త్వరగా పనులు పూర్తి చేశారని కీర్తి వర్ధన్ సింగ్ వెల్లడించారు. ఇక క్షతగాత్రులు కూడా త్వరగా కోలుకుని రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. తన పర్యటనలో ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్-యూసుఫ్ అల్-సబాను కలిశానని.. మృతదేహాలను త్వరగా స్వదేశానికి రప్పించడంలో పూర్తి మద్దతు, సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇదిలా ఉంటే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేష్ గోపి, కేంద్ర మాజీ మంత్రి మురళీధరన్ విమానాశ్రయానికి వచ్చి భౌతికకాయాలకు నివాళులర్పించారు.
మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని, బాధితుల గుర్తింపును నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. అధికారులు 48 మృతదేహాలను గుర్తించారు. వారిలో 45 మంది భారతీయులు, ముగ్గురు ఫిలిప్పీన్స్ జాతీయులు ఉన్నట్లు తెలిపారు.
#WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.
(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS
— ANI (@ANI) June 14, 2024
#WATCH | Ernakulam: Union Minister Suresh Gopi and other leaders pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/exa7JpAA9L
— ANI (@ANI) June 14, 2024
- Tags
- 5 Indians
- bodies
- died
- Kerala
- Kuwait fire
తాజావార్తలు
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!