Olympic Gold Medallist: ప్రసవ సమస్యలతో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు మరణించింది. అమెరికాకు చెందిన 32 సంవత్సరాల 2016 ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోరీ బౌవీ ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్టు తన ఏజెంట్ ప్రకటించింది. శవపరీక్షలోనూ అదే బయటపడటంతో.. బౌవీ మరణించిన కొన్ని రోజుల తరువాత తన ఏజెంట్ ఈ విషయాన్ని ప్రకటించారు.
Read also: Botsa Satyanarayana: వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది?.. పవన్ యాత్రపై బొత్స సెటైర్లు
టోరీ బౌవీ, ఒక అమెరికన్ స్ప్రింటర్ మరియు మూడు ఒలింపిక్ పతకాలతోపాటు రెండు ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్న లాంగ్ జంపర్. ప్రసవ సమస్యల కారణంగా మే ప్రారంభంలో 32 సంవత్సరాల వయస్సులో తను మరణించినట్టు ఆమె ఏజెంట్ కింబర్లీ హాలండ్ తెలిపారు. బౌవీ మరణించే సమయంలో ప్రసవ వేదన పడినట్టు శవపంచనామాలో బయటపడిందని తెలిపారు. ఏజెంట్ మాటల ప్రకారం బౌవీ మరణించే సమయంలో అమెరికాలోని ఫ్లోరిడాలో తన ఇంట్లో ఉన్నది.. దురదృష్టవశాత్తూ మీడియాతో సహా చాలా మంది ఆమె తనను తాను ఏదో చేసుకుందని ఊహాగానాలు చేస్తున్నారని ఇది చాలా బాధ కలిగించిందదని చెప్పారు. ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే చాలా మంది క్షమాపణలు చెబుతారని ఆశిస్తున్నట్టు మీడియాతో అన్నారు.
Read also: IND vs WI: బలహీన టీంపై ప్రతాపం చూపిస్తే ఏం లాభం?.. టీమిండియాను ఎద్దేవా చేసిన భారత లెజెండ్!
Uశవపరీక్ష నివేదిక ప్రకారం బౌవీ దాదాపు ఎనిమిది నెలల గర్భవతని..తన గర్భంలో బాగా అభివృద్ధి చెందిన పిండం ఉన్నట్టు కనుగొన్నారు. గత నెలలో మరణించే సమయానికి ఆమెకు ప్రసవవేదన జరిగిందని అధికారులు తెలిపారు. అథ్లెట్స్ కు సాధారణంగా ప్రమాదాలలో శ్వాసకోశ మరియు ఎక్లాంప్సియా వంటి సమస్యలుంటాయన్నారు. గర్భధారణ సమయంలో రక్తపోటు అకస్మాత్తుగా పెరిగడంతో వ్యక్తులు మూర్ఛలకు గురవుతారని అలాంటి సమస్యలతో మరణించినట్టు అధికారులు ప్రకటించారు. ఆమె మరణం సహజమేనని ఆరెంజ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ అధికారి నిర్ధారించారు. 2016 ఒలింపిక్ క్రీడలలో మూడు పతకాలు సాధించారు. 2019లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్ లో లాంగ్ జంప్‌లో ఆమె నాల్గవ స్థానంలో నిలిచింది. జూన్ 2022లో చివరి పోటీలో బౌవీ పాల్గొన్నట్టు తన ఏంజెట్ ప్రకటించారు.