Hyderabad: ఉరితాడైన అమ్మచీర.. ఊపిరాడక చిన్నారి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి ముందు తల్లి చీరతో కట్టిన ఊయల ఆ చిన్నారికి ఉరితాడైంది. ఊయలతో ఆడుకుంటున్న ఎనిమిదేళ్ల చిన్నారికి.. చీర మెడకు బిగిసుకుపోవడంతో ఊపిరాడక ఆ చిన్నారి అక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
లాలాపేట్‌కు చెందిన రాజేష్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ప్రసన్నజ్యోతి కూలి పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె కోట ఎలీనా (8) శనివారం ఇంటి ముందు తల్లి చీరను మెట్లకున్న పెద్దమేకుకు కట్టి ఊయల చేసి ఆడుకుంటుండగా ఆ చిన్నారి మెడకు చుట్టుకుపోయి గట్టిగా బిగిసుకుంది. చీరను తీసేందుకు బాలిక ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఊపిరాడక ఎలీనా అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది.
Also Read
తన అక్క మాట్లాడడం లేదని గమనించిన చెల్లెళ్లు సమీపంలోని బంధువులకు చెప్పారు. దీంతో ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా ఎలీనా అప్పటికే ప్రాణాలు విడిచిందని స్థానికులు, బంధువులు తెలిపారు. ఆ సమయంలో తండ్రి ఊరెళ్లినట్లు తెలిపారు. తల్లి ఆలస్యంగా విషయాన్ని తెలుసుకుని బోరున విలపించింది. స్థానికుల ఫిర్యాదు మేరకు లాలాగూడ పోలీసులు చిన్నారి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!