ప్రముఖ చిత్రకారుడు బాలి (మేడిశెట్టి శంకరరావు) కుమారుడు గోకుల్ (45) అమెరికాలో దుర్మరణం పాలయ్యారు. కొద్ది రోజులుగా అమెరికాలో మంచు తుఫాన్ విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం అందులో చిక్కుకుని గుంటూరుకు చెందిన దంపతులు చనిపోయారు. వారిని రక్షించబోయి, మంచులో కూరుకు పోయి… గోకుల్ సైతం తుదిశ్వాస విడిచాడు. గోకుల్ భార్య శ్రీదేవి, కుమార్తె మహతి ఒడ్డున ఉండి చూస్తుండగానే అతను ప్రాణాలు కోల్పోయాడు.

Read Also: Top Headlines @9PM: టాప్ న్యూస్
మేడిశెట్టి గోకుల్ పదిహేనేళ్ళుగా అమెరికాలోనే ఉంటున్నాడు. అక్కడి జీవిత భీమా సంస్థలో అధికారిగా సేవలందిస్తున్నాడు. చిత్రకారులు, కార్టూనిస్టు బాలికి ఓ కుమారుడు, ఓ కుమార్తె. ఇద్దరూ అమెరికాలోనే తమ కుటుంబాలతో స్థిరపడ్డారు. గోకుల్ల్ ఆకస్మిక మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విశాఖపట్నంలో ఉంటున్న బాలిని మిత్రులు, బంధువులు పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు.
అమెరికాలోని అరిజోనాలో క్రిస్టమస్ మరునాడు ఫోటోలు తీసుకోడానికి గడ్డకట్టిన సరస్సు లోనడుస్తూ మంచు కరగగా సరస్సులో పడి మృతిచెందినవారు గుంటూరు జిల్లా పాలపర్రు కుచెందిన శ్రీ ముద్దన నారాయణరావు శ్రీమతి ముద్దన హరిత దంపతులు మరియు వారిని కాపాడడానికి వెళ్ళిమృత్యువు పాలయిన వారి మిత్రుడు విశాఖపట్నానికి చెందిన శ్రీ మేడిశెట్టి గోకుల్ ..వీరి మృతదేహాలు 28-12-2022 నాడు వెలికితీయడం జరిగింది.
Read Also;Top Headlines @9PM: టాప్ న్యూస్