చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. బుధవారం రాత్రి రోడ్డు దాటుతున్న ఏనుగుల గుంపు ప్రమాదానికి గురయ్యింది. ఇందులో రెండు గున్న ఏనుగులు, ఒక పెద్ద ఏనుగు మరణించాయి. అయితే, పలమనేరు సమీపంలోని జాతీయ రహదారికి ఇరు వైపుల అడుగులున్నాయి. దీంతో ఏనుగులు ఆహారం కోసం గుంపుగా అటు ఇటు తిరుగుతుంటాయి. ఒక్కోసారి పగటి పూటా పెద్ద గుంపు రోడ్డుపై నిలబడి ఉన్న సందర్భాలూ చాలానే ఉన్నాయి. అలాంటి సమయాల్లో వాహనదారులు దూరంగానే తమ వాహనాలను నిలిపేసి ఏనుగులు రోడ్డు దాటాక తమ ప్రయాణం చేస్తుంటారు. తాజాగా.. బుధవారం రాత్రి బూతలబండ మలుపు వద్ద రోడ్డు దాటుతున్న ఏనుగులను చెన్నైకి కూరగాయాల లోడ్‌తో వెళ్తున్న మినీలారీ ఢీకొంది. ఈ ఘటనలో మూడు ఏనుగులు మృతిచెందాయి. వీటిలో ఒక పెద్ద మగ ఏనుగు, రెండు చిన్న ఏనుగులు (మగ, ఆడ) ఉన్నాయి.
Also Read : What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే వ్యాన్ ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవరు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే జాతీయ రహదారిపై రెండువైపులా వెహికిల్స్ భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది. పలమనేరు రేంజర్ శివన్న సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేయించారు. చిత్తూరు డీఎఫ్వో చైతన్యకుమార్‌రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్లారు. దీనిపై కేసు నమోదు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏనుగులను ఎక్స్‌కవేటర్ సాయంతో సమీప అటవీలోకి తరలించారు.
Also Read : Telangana : ఘోర ప్రమాదం.. బిడ్జి పై నుంచి కింద పడ్డ ఆటో..ఆరుగురు మృతి..
దీంతో ఇవాళ అక్కడే వీటికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాగా, చీకట్లో ఏనుగులు రోడ్డుదాటుతున్న విషయాన్ని డ్రైవరు గుర్తించలేకపోవడంతో.. అతివేగంగా వస్తున్న మినీలారీ ఢీకొన్నట్లు భావిస్తున్నారు. ఇలా రోడ్డు ప్రమాదంలో ఏనుగులు చనిపోవడం ఇదే మొదటి సారి. అయితే.. ఇప్పటి వరకు విద్యుత్ తీగలు తగిలి లేదా అనారోగ్య కారణాలతో మృతిచెందాయి.