Medchal: వయసు భేదం లేకుండా గుండెపోటుతో ఈ మధ్య కాలంలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన వాళ్లు కొన్ని క్షణాల్లోనే విగతజీవులవుతున్నారు. నడుస్తూ.. ఆడుతూ.. పాడుతూ.. మాట్లాడుతూ..ఇలా కూర్చున్న చోటే కుప్పకూలుతున్నారు. తాజాగా కీసర ఎంపీడీవో హార్ట్ ఎటాక్ తో ప్రాణాలు వదిలారు. హైదరాబాద్ వనస్థలిపురంలో నివసిస్తు్న్న ఆమె ఆదివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను మలక్ పేట యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె చనిపోయినట్లు ధ్రువీకరించారు. గతంలో మేడ్చల్ ఎంపీడీవోగా పనిచేసిన రమాదేవి ఆరు నెలల క్రితమే కీసర ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. ఆమెకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆమె మృతితో కుటంబంలో విషాదం నెలకొంది. అధికారిణి హఠాత్మరణంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది షాకుకు గురయ్యారు.
Read Also: Solar ecilipse effect: ఈ రాశుల వారికి పట్టిందే బంగారం.. అందులో మీరు ఉన్నారా?
గుండెపోటుకు గురైనప్పుడు వ్యక్తి శ్వాస తీసుకోలేకపోతే, రక్తం ప్రవహించేందుకు సీపీఆర్ చేయొచ్చునని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇలా సీపీఆర్ చేసి ఎన్నో ప్రాణాలను కాపాడిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆకస్మాత్తుగా వచ్చే గుండెపోట్ల నుంచి కాపాడేందుకు ప్రభుత్వ వైద్య సిబ్బందింతో పాటు పలు డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. సీపీఆర్ చేయటం వల్ల ఆగిపోయిన గుండెను తిరిగి పనిచేసేలా చేయవచ్చునని వైద్యులు చెబుతున్నారు.