Dharmendra : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర కొన్ని గంటల క్రితమే మృతిచెందారు. దీంతో ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాల పాటు బాలీవుడ్ ఏలిన ధర్మేంద్ర.. 300 వందలకు పైగా సినిమాల్లో నటించాడు. ఇక ధర్మేంద్ర మృతిపై ఇటు టాలీవుడ్ హీరోలు కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ చేసి ఎమోషనల్ అయ్యారు. ‘ధర్మేంద్ర కేవలం దగ్గజ నటుడు మాత్రమే కాదు. ఒక అద్భుతమైన వ్యక్తి కూడా.…
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (89) ఇకలేరు. కొంతకాలంగా శ్వాస సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయిన కొద్దిరోజులకే మళ్లీ అనారోగ్యం తీవ్రరూపం దాల్చింది. దీంతో ముంబైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ధర్మేంద్ర, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ చివరికి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు పెద్ద నష్టంగా భావిస్తున్నారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 1960లో సినీరంగ ప్రవేశం చేసిన తరువాత దాదాపు…
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. 89 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది. Also…
ఆ నాటి 'డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియా' హేమామాలినికి మేచోమేన్ ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ హేమామాలినిని కొందరు ఓ విషయంలో ప్రశ్నించడం మాత్రం మానలేదు.
హిందీ చిత్రసీమలో కండలు తిరిగిన సౌష్టవంతో స్టార్స్ గా రాణించిన ఆ నాటి నటుల్లో ధర్మేంద్ర స్థానం ప్రత్యేకమైనది. ‘మేచో మేన్’గా పేరొందిన తొలి హిందీ హీరో ధర్మేంద్ర అనే చెప్పాలి. అప్పట్లో ఎంతోమంది అందాలభామల కలల రాకుమారునిగా ధర్మేంద్ర రాజ్యమేలారు. ‘డ్రీమ్ గర్ల్’గా పేరొందిన హేమామాలిని అంతటి అందాలభామను తన సొంతం చేసుకున్నారు ధర్మేంద్ర. తనదైన అభినయంతో ధర్మేంద్ర బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ అలరిస్తూ సాగారు. కలర్ సినిమా రోజుల్లో అయితే ధర్మేంద్ర…
(సెప్టెంబర్ 24తో ‘గుడ్డి’ సినిమాకు 50 ఏళ్ళు) స్టార్ హీరోయిన్ గా, మహానటిగా పేరొంది, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న జయాబచ్చన్ కెరీర్ ను మలుపు తిప్పిన చిత్రం ‘గుడ్డి’. 1971 సెప్టెంబర్ 24న విడుదలయిన ‘గుడ్డి’ చిత్రంలో మేచో హీరో ధర్మేంద్ర వీరాభిమానిగా జయబాధురి నటించారు. ఇందులో ‘గుడ్డి’ టైటిల్ రోల్ లో జయబాధురి అలరించిన తీరు భలేగా ఆకట్టుకుంది. ఈ సినిమా నగరాలలో ఘనవిజయం సాధించింది. ఇతర చోట్ల ఏవరేజ్ గా, ఎబౌ ఏవరేజ్…