బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రిపాలయ్యారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. 89 ఏళ్ల ఆయన ఆసుపత్రిలో చేరిన వార్త ఆయన అభిమానుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, వయసు రీత్యా జరిగే సాధారణ ఆరోగ్య పరీక్ష కోసం ఆసుపత్రికి వచ్చినట్లు సన్నిహిత కుటుంబ వర్గాలు వెల్లడించాయి. ధర్మేంద్ర పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని రెగ్యులర్ చెకప్ ల కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు ధర్మేంద్ర బృందం తెలిపింది.
Also Read:Sudden Rains: ఏపీలో అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు..
త్వరలో 90 ఏళ్లు నిండనున్న ధర్మేంద్ర, ఈ వయసులో కూడా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. త్వరలో రాబోయే ‘ఇక్కీస్’ సినిమాలో కూడా కనిపించనున్నాడు. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ‘ఇక్కీస్’ సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద ఈ సినిమాలో సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేతర్పాల్ పాత్రలో నటించాడు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది, ఇందులో ధర్మేంద్ర కూడా కనిపించాడు.