Hema Malini-Dharmendra: ఆ నాటి ‘డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియా’హేమమాలినికి మేచోమేన్ ధర్మేంద్రతో పెళ్ళయి 43 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ హేమామాలినిని కొందరు ఓ విషయంలో ప్రశ్నించడం మాత్రం మానలేదు. నటి సిమీ గేర్వాల్ ఓ వీడియో కోసం మాజీ డ్రీమ్ గర్ల్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో “ధర్మేంద్ర రెండో భార్యగా ఉండాలని ఎందుకు కోరుకున్నారు? అప్పటికే ఆయనకు భార్య ఉండగా, ఆమెను చూసి ఎప్పుడూ అసూయ చెందలేదా?” అన్నది ప్రశ్న. ధర్మేంద్రతో పెళ్ళయిన దగ్గర నుంచీ చూసుకుంటే ఈ 43 ఏళ్ళలో ఇప్పటికి కొన్ని వేలసార్లు హేమను ఇంటర్వ్యూ చేసిన వారు ఈ ప్రశ్నను అడిగే ఉంటారు. అందుకు తగ్గ సమాధానం హేమ ఇస్తూనే ఉన్నారు. ఈ సారి ఏ మాత్రం తడుముకోకుండా, “అసలు ఎందుకు అసూయ పడాలి. నన్ను ప్రేమించే మనిషి నాకు కావలసినంత ప్రేమను పంచుతున్నప్పుడు అసూయకు తావేలేదు” అని హేమామాలిని ఇచ్చిన సమాధానం ఆమె అభిమానులకు ఆనందం కలిగిస్తోంది.
Read also: Harish Rao: లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసై నేటికి 9 ఏళ్లు మంత్రి ట్విట్ వైరల్
1970ల ఆరంభంలో ధర్మేంద్ర, హేమమాలిని జోడీ జనాన్ని భలేగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ ఉందనే పుకార్లు మొదలయ్యాయి. తరువాత వాటిని ధర్మేంద్ర నిజం చేయాలని ఆశించారు. అతనిలోని ప్రేమను గుర్తించిన హేమామాలిని సైతం వయసులో తనకంటే 13 ఏళ్ళు పెద్దవాడయినా ఓకే చెప్పారు. అందునా భార్య, నలుగురు సంతానం ఉన్నప్పటికీ ధరమ్ ప్రేమను కాదనలేక పోయారు హేమ. 1980లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచీ ధర్మేంద్ర ‘రెండిళ్ళ పూజారి’గా సాగుతున్నా, ఏ నాడూ తన భార్యలకు తనపై ఆరోపణలు చేసే అవకాశం కల్పించలేదు. అదే ధర్మేంద్ర సక్సెస్ ఫుల్ మేన్ గా సాగడానికి సీక్రెట్ అనీ బాలీవుడ్ లో కొందరు అంటూనే ఉంటారు. మళ్ళీ ఇన్నాళ్ళకు ఈ విషయాలను గుర్తు చేసుకోవడం తనకు ఆనందంగానే ఉందని హేమామాలిని అంటున్నారు. ‘ప్రేమ అన్నది మనం ఇచ్చే కొద్దీ రెట్టింపుగా వస్తూనే ఉంటుంది’ అని ఈ సందర్భంగా హేమ చెప్పారు. ఆ కిటుకు తనకు, తన భర్తకు బాగా తెలుసుననీ ఆమె అనడం విశేషం!
Income Tax survey on BBC: బీబీసీ లావాదేవీలపై ఐటీశాఖ రిపోర్ట్.. కీలక అంశాల ప్రస్తావన