Eknath Shinde: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై కొంత కాలంగా నెలకొన్ని ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేశారు. ఇక, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లకు బాధ్యతలు అప్పగించారు. కాగా, మహాయుతిలో మంత్రిత్వశాఖల కేటాయింపులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో శివసేన (షిండే) ఎమ్మెల్యే భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Also: Pushpa 2: “సర్.. నేను పుష్ప 2 సినిమాకు వెళ్తున్నా..” మేనేజర్‌కి ఉద్యోగి మెసేజ్
అయితే, మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన మహాయుతి సర్కార్ లో తనకు హోంశాఖను ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే డిమాండ్ చేశారని శివసేన ఎమ్మెల్యే భరత్ గోగవాలే తెలిపారు. షిండే సీఎంగా ఉన్న సమయంలో ప్రస్తుత సీఎం ఫడ్నవీస్‌కు హోంశాఖ ఇచ్చారని గుర్తు చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు ముందే డిసెంబరు 11 నుంచి 16 మధ్య రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. నాగ్‌పూర్‌లో డిసెంబర్ 16వ తేదీన శాసనసభ శీతాకాల సమావేశాలు స్టార్ట్ కానున్నాయి.
Read Also: Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్ తదుపరి వారసులు ఎవరు? మమతా బెనర్జీ ఏమన్నారంటే..
కాగా, గత మహాయుతి సర్కార్ లో శివసేనకు ఉన్న శాఖలను మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మరో శివసేన (షిండే) ఎమ్మెల్యే ఆరోపించారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని గత ప్రభుత్వంలో మాదిరిగానే ఎన్సీపీ తమ దగ్గరున్న ఆర్థికశాఖను, హోంశాఖను బీజేపీ అట్టిపెట్టుకోవాలని చూస్తుందని ఆరోపించారు. కాగా, శివసేనకు పట్టణాభివృద్ధి, రెవెన్యూ శాఖలు దక్కే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.