Eknath Shinde: డిప్యూటీ సీఎం పదవికి షిండే గ్రీన్‌సిగ్నల్.. రేపే ప్రమాణం
- డిప్యూటీ సీఎం పదవికి షిండే గ్రీన్‌సిగ్నల్
- గురువారం ప్రమాణం చేయనున్న షిండే
- అధికారికంగా ధృవీకరించిన శివసేన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకున్న అనిశ్చితి ఎట్టకేలకు తొలగింది. నవంబర్ 23న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి (శివసేన, బీజేపీ, ఎన్సీపీ) కూటమి ఘన విజయం సాధించింది. కానీ వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. డైలీ సీరియల్ లాగా దాదాపు 11 రోజుల పాటు సీఎం పోస్టుపై పంచాయితీ నడిచింది.
శివసేన ముఖ్యమంత్రి పదవిని ఆశించింది. అందుకు బీజేపీ నిరాకరించింది. బీజేపీకి 132 సీట్లు రాగా.. శివసేనకు కేవలం 57 సీట్లే వచ్చాయి. అయితే బీహార్ ఫార్ములా అమలు చేయాలని.. నితీష్ కుమార్‌ను సీఎంను చేసినట్లుగా షిండేను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టాలని శివసేన డిమాండ్ చేసింది. ఇలా మహారాష్ట్ర పంచాయితీ రెండు వారాల పాటు సాగింది. మొత్తానికి బీజేపీ అధిష్టానం.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని రంగంలోకి దింపింది. చర్చోప చర్చల తర్వాత శివసేన మెత్తబడింది. బీజేపీ ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమైంది. అంతేకాకుండా దేవేంద్ర ఫఢ్నవిస్ ముఖ్యమంత్రిగా.. డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతో 11 రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్ పడింది. గురువారం ఆజాద్ మైదాన్‌లో దేవేంద్ర ఫఢ్నవిస్, షిండే, అజిత్ పవార్‌తో పాటు పలువురు కూటమి సభ్యులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..
బుధవారం ఫడ్నవిస్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అనంతరం షిండే, అజిత్ పవార్‌తో కలిసి గవర్నర్ రాధాకృష్ణన్‌ను ఫడ్నవిస్ కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కోరారు. గురువారం సాయంత్రం 5:30 గంటలకు ఆజాద్ మైదాన్‌లో ప్రమాణస్వీకారం జరగనుంది. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, ఎన్డీఏ ముఖ్యనేతలు హాజరుకానున్నారు.
కొత్త ప్రభుత్వంలో 7:7:7 నిష్పత్తిలో మూడు పార్టీలు మంత్రుల పదవులు పంచుకోనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి ఏడుగురు, శివసేన నుంచి ఏడుగురు, ఎన్సీపీ నుంచి ఏడుగురు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా.. షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేయనున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ -132, శివసేన-57, ఎన్సీపీ-41, కాంగ్రెస్-16, ఉద్ధవ్ థాక్రే-20, శరద్ పవార్-10 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయాం అంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: పదేళ్లలో ఏం చేయకపోగా.. 10 నెలల మా పాలనపై విష ప్రచారం చేస్తున్నారు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!