Maharashtra CM: మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్సీపీ అజిత్ పవార్, ఏక్‌నాథ్ షిండే శివసేనల ‘‘మహాయుతి’’ కూటమి సంచలన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 233 సీట్లను గెలిచింది. అయితే, విజయం సాధించిన నాలుగు రోజులైనప్పటికీ, మహారాష్ట్రకు కాబోయే కొత్త సీఎం ఎవరనేదానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. సీఎం రేసులో దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు ఏక్‌నాథ్ షిండే ఉన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఈ సస్పెన్స్ ఈరోజు (బుధవారం) ఉదయం వీడే ఛాన్స్ ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఏక్‌నాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లు భేటీ అవుతారని శివసేన(షిండే) నేత సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
Eknath Shinde: శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఈరోజు (మంగళవారం) రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ కు అందజేశారు.
Maharashtra: మహారాష్ట్రలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఈరోజు (మంగళవారం)తో గడువు ముగియనుంది. కాబట్టి కొత్త సర్కార్ ఏర్పాటుకు మహయుతి కూటమి ప్లాన్ చేస్తుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి నేతలు రెడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరన్నది..? ఓ పెద్ద ప్రశ్నగా మారిపోయింది. సీఎం పదవి కోసం దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే ఇద్దరూ గట్టిగా పోటీ పడుతున్నారు.
Maharashtra New CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టిన నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందు కోసం గట్టిగా పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది.
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదే అతిపెద్ద ప్రశ్న. మరి మహాయుతి వర్గాల్లో ఏ పార్టీ అధినేతకు ఏ స్థానం దక్కుతుంది? ఈ ప్రశ్నల నడుమ దీనికి సంబంధించిన కొన్ని రియాక్షన్లు కూడా రావడం మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి బంపర్ విజయం సాధించిన తర్వాత ఏకనాథ్ షిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజిత్ పవార్ మాట్లాడుతూ..