Eknath Shinde: డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే సొంత ప్రసంగం.. షాకైన మహాయుతి నేతలు
- మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం..
- ప్రమాణస్వీకారం సమయంలో సొంత ప్రసంగం చదివిన షిండే..
- గవర్నర్ అడ్డుకోవడంతో.. ప్రోటోకాల్ ప్రకారం ప్రమాణస్వీకారం చేసిన షిండే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eknath Shinde: గత 10 రోజులుగా మహారాష్ట్రలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఈరోజు తెరపడింది. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా, శివసేన (షిండే) చీఫ్ ఏక్‌నాథ్ షిండే, ఎన్సీపీ (ఏపీ) అధినేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మహాయుతి కూటమిని లాస్ట్ వరకు టెన్షన్‌కు గురి చేసిన షిండే ప్రమాణ స్వీకారం సందర్భంగా సొంత ప్రసంగం చదివారు.
Read Also: Maoist Party: పోలీసులే విషమిచ్చి చంపారు.. 9న రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపు
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
అయితే, మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం ప్రక్రియను స్టార్ట్ చేశారు. ఇక, ఏక్‌నాథ్ షిండే అక్కడున్న స్క్రిప్ట్‌ను చదవకుండా సొంతంగా ప్రసంగించారు. నా గురువు ధర్మవీర్ ఆనంద్ దిఘేని స్మరిస్తూ.. హిందూ హృదయ్ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రేకు నా ప్రణామాలు.. అలాగే, ప్రధాని మోడీ బలమైన నాయకత్వంలో.. హోంమంత్రి అమిత్ షా ఆశీర్వాదంతో పాటు మహారాష్ట్రలోని 13 కోట్ల మంది ఓటర్ల సపోర్టుతో అని ప్రసంగం చేశారు. దీంతో వేదికపై ఉన్న మోడీ, అమిత్ షా, ఫడ్నవీస్ సహా ముఖ్యనేతలందరూ షాక్ అయ్యారు. ఏం జరుగుతుందో తెలియక తికమక పడ్డారు.
Read Also: Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రసంగాలపై నిషేధం..
ఇక, ఏక్‌నాథ్ షిండే ప్రసంగాన్ని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అడ్డుకోవడంతో.. రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకార ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తూ.. తిరిగి ‘నేను’ అని చెప్పుకొచ్చారు. దీంతో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా షిండే ప్రమాణం చేశారు. అయితే, ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చెల్లినప్పటికీ ప్రోటోకాల్‌ను ఆయన పాటించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
#WATCH | Shiv Sena's Eknath Shinde takes oath as Deputy CM of Maharashtra pic.twitter.com/G33WOBOLbw
— ANI (@ANI) December 5, 2024
తాజావార్తలు
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!