Amruta fadnavis: ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై భార్య అమృత ఏమన్నారంటే..!
- ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై భార్య అమృత స్పందన
- అందమైన రోజు అంటూ వ్యాఖ్య
- మరింత బాధ్యత పెరిగిందని వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి ఫడ్నవిస్ సీఎంగా ప్రమాణం చేశారు. గురవారం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఫడ్నవిస్ చేత గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా అతిరథ మహరథులంతా హాజరయ్యారు. ఎన్డీఏ మఖ్యమంత్రుల సహా బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.
ఇదిలా ఉంటే ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృతా ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. అందమైన రోజుగా పేర్కొన్నారు. ఫడ్నవిస్ ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై.. మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం చాలా అందమైన రోజుగా అభివర్ణించారు. చాలా సంతోషంగా ఉందని.. అలాగే మరింత బాధ్యత కూడా పెరిగిందని పేర్కొన్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ముంబైలో జరిగిన ప్రమాణస్వీకారంలో ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ముఖ్యమంత్రులు చంద్రబాబు, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, చిరాగ్ పాశ్వాన్‌తో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రణవీర్ సింగ్, మాధురీ దీక్షిత్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024 ఫలితాల్లో మహాయుతి 235 సీట్లతో భారీ విజయాన్ని సాధించింది. 132 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. శివసేన 57, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో గెలుపొందగా… భాగస్వామ్య పక్షాలు శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్ పవార్ వర్గం) వరుసగా 20, 10 స్థానాలను గెలుచుకున్నాయి.
#WATCH | Mumbai: After the oath ceremony, Maharashtra CM Devendra Fadnavis's wife, Amruta Fadnavis says, "I am very happy that Devendra ji has taken oath as the CM for the third time today. Till now, he has spent his life in service of the people and he will continue to do… pic.twitter.com/4XezRZHK6u
— ANI (@ANI) December 5, 2024
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!