Sanjay Raut: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. అధికారంలో ఉన్న పార్టీకి ఈ స్థాయిలో ఫలితాలు రావడం ఎవరూ ఊహించి ఉండరు. 48 సీట్లు ఉన్న ఆ రాష్ట్రంలో బీజేపీ కేవలం 09 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది.
Devendra Fadnavis: తాజాగా జరిగిన 18వ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మెజారిటీ స్థానాలు సాధించి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ మూడోసారి వరసగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.
Devendra Fadnavis: మహారాష్ట్ర రాజకీయాల్లో 26/11 ముంబై ఉగ్రదాడులు ప్రధానాంశంగా మారాయి. కాంగ్రెస్ నేత విజయ్ వాడెట్టివార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను అమరావతి ఎంపీ, ప్రస్తుత బీజేపీ లోక్‌సభ అభ్యర్థి నవనీత్ కౌర్ దంపతులు కలిశారు. ఫడ్నవిస్ నివాసంలో ఆయనను కలిశారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, బీజేపీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2022లో తమ కూటమి అధికారంలోకి రావడానికి కారణం రెండు పార్టీల్లో చీలికని స్పష్టం చేశారు. ఆ చీలిక జరగడం వల్ల తనకు ఇద్దరు మిత్రులు లభించారని వివరించారు.
Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండియా కూటమిలో ఉన్న శరద్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్లను మార్చి 2న లంచ్‌కి రావాల్సిందిగా ఆహ్వానించారు. తన సొంత ప్రాంతం బారామతిలోని తన నివాసంలో జరిగే కార్యక్రమానికి ఆహ్వానం పంపారు. శరద్ పవార్ రాజకీయ ప్రత్యర్థులైన వీరికి ఆహ్వానం పంపండం ప్రాధాన్యతన సంతరించుకుంది.
Maratha quota: మహారాష్ట్రలో మరాఠా కోటా కోసం ఉద్యమిస్తున్న నాయకుడు మనోజ్ జరాంగే సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనను చంపేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. మనోజ్ జరాంగే ఆదివారం ముంబైకి మార్చ్‌ని ప్రకటించాడు. ఆయన నివాసం వెలుపల తెలుపుతామని అన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేయమని కొంతమందిని ప్రలోభ పెడుతున్నారని, ఈ కుట్రల వెనక దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడని, నన్ను చంపాలనుకుంటున్నాడని, నేను వెంటనే సాగర్ బంగ్లా( ముంబాయిలో మలబార్…
Mumbai: అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ర్యాలీలు జరిగాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ముంబై శివార్లలోన మీరా రోడ్లో ఆదివారం రాత్రి ఘర్షణ ఏర్పడింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు.
Devendra Fadnavis: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ.. బీజేపీ నేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన బీజేపీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో ఫడ్నవీస్, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. ‘ రాహుల్ గాంధీ బీజేపీకి దేవుడు ఇచ్చిన వరం.. ప్రతిపక్ష నేత ఇలాగే ఉంటే మనం అదృష్టవంతులుగా భావించాలి’ అని ఆయన ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వంటి ప్రతిపక్ష నేత ఉండటం బీజేపీకి అదృష్టాన్ని తీసుకువస్తోందని అన్నారు.
Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది.