Sharad Pawar: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తుపై మాట్లాడుతూ.. బీజేపీతో వెళ్లే ప్రశ్నే లేదని కుండబద్ధలు కొట్టారు. ఇండియా టుడే కాంక్లేవ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే ఇప్పటికే శరద్ పవార్ పార్టీ ఎన్సీపీలో చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గం బీజేపీ, ఏక్‌నాథ్ షిండే శివసేనతో చేతులు కలిపి మహారాష్ట్రలో అధికారంలో ఉంది.
ఈ రోజు జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో మాట్లాడుతూ.. అంతకుముందు డిప్యూటీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. నా పార్టీ కార్యకర్తలు గందగగోళంలో ఉన్నారని తానున అనుకోనని శరద్ పవార్ అన్నారు. అంతకుముందు దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. ఆ సమయంలో శివసేన పొత్తు నుంచి వైదొలిగే సమయంలో, బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అనుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Rahul Gandhi: అమ్మ సోనియాకు రాహుల్ గాంధీ సర్‌ప్రైజ్ గిఫ్ట్..
2024 ఎన్నికల గురించి మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ లేదని శరద్ పవార్ అన్నారు. ఈ రోజు మహారాష్ట్రలో ఎన్నికలు జరిగితే శివసేన(ఉద్ధవ్ ఠాక్రే), ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ.. ఇది కేజ్రీవాల్ పై ప్రతీకరా చర్య అని పవార్ విమర్శించారు. బీజేపీతో పడని నేతలపై సీబీఐ, ఈడీలను ప్రయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈడీ చర్యలు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలను ఒక తాటిపైకి తీసుకువస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు.