బాలయ్య ఎంత బిజీగా ఉన్నా ఆయన మనసు హిందూపురంపైనే.. నియోజకవర్గం అభివృద్ధి గురించే ఆలోచిస్తారని తెలిపారు సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.. శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని వీవర్స్ కాలనీలో జరిగిన సుప రిపాలనకు తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు.
CM Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4….…
CLP Meeting: తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్షం (CLP) సమావేశం నేడు (మంగళవారం) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశం ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింత ప్రభావవంతంగా తీసుకెళ్లే దిశగా చర్చలు సాగనున్నాయి. గాంధీభవన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.., జూన్ 2వ తేదీ వరకు రాష్ట్రంలోని మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజల్లోనే ఉండి ప్రభుత్వ పథకాలను వివరించేందుకు…
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉదయం హెలికాప్టర్‌లో వనపర్తికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత దేవాలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం బాయ్స్ జూనియర్ కాలేజీ మైదానంలో రూ.880 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.…
Komatireddy Venkat Reddy : రేపు (20.01.2025) నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యనటలో భాగంగా ఆయన కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి చేరుకోనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉదయం 10.15 గంటలకు.. దర్వేశిపురం గ్రామంలో కొత్తగా ఎన్నికైన…
అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో రాష్ట్రంలో అమలవుతున్న పథకాలపై విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే అభివృద్ధి కార్యక్రమాల అమలుపై వివరాలు పరిశీలించనున్నారు. తాజాగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు దృష్ట్యా, ప్రభుత్వ పథకాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు, నాయకులు,…
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ. 35 కోట్లతో పలు రోడ్లు, కమ్యూనిటీ హల్స్ శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. మహిళ సాధికరితకు రూ. 80 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. పులివెందులలో ముఖ్యమంత్రి వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తారు. అధికారికంగా ఖరారైన సీఎం పర్యటన వివరాలు ఇలా..
కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.. కానీ, ఆ విషయం ప్రజలకు ఎందుకు చెప్పడం లేదు ? అని నిలదీశారు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.