Komatireddy Venkat Reddy : రేపు (20.01.2025) నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. ఈ పర్యనటలో భాగంగా ఆయన కనగల్, తిప్పర్తి, నల్గొండ మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 07.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 9.45 గంటలకు నల్గొండ జిల్లా కనగల్ మండలం దర్వేశిపురం గ్రామానికి చేరుకోనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఉదయం 10.15 గంటలకు.. దర్వేశిపురం గ్రామంలో కొత్తగా ఎన్నికైన శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ కమిటీ చేత ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఉదయం 11.45 గంటలకు కనగల్ మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలిస్తారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
Korukonda Temple: ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం..
అంతేకాకుండా.. మ. 12 గంటలకు: 14 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న కనగల్-తిమ్మన్నగూడెం రహదారి పనులకు తిమ్మన్నగూడెం గ్రామంలో శంకుస్థాపన చేస్తారు. మ. 12.15 గంటలకు: తిప్పర్తి మండలం పజ్జూర్ గ్రామం చేరుకొని గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గొడౌన్ భవనాన్ని ప్రారంభిస్తారు. మ. 12.45 గంటలకు: పజ్జూర్ గ్రామంలోనే కొత్తగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప-కేంద్ర భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. మ. 01.15 గంటలకు: తిప్పర్తి మండల కేంద్రానికి చేరుకొని.. నూతనంగా నిర్మించ తలపెట్టిన గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ చేయడంతో పాటు తిప్పర్తిలో డీసీసీబీ బ్యాంకు నూతన బ్రాంచ్ ను ప్రారంభిస్తారు. మ. 01.45 గంటలకు: అనంతరం తిప్పర్తి మండల కేంద్రంలో జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు నూతనంగా నిర్మించతలపెట్టిన ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవన నిర్మాణానికి స్థల పరిశీలన చేస్తారు. తర్వాత సాయంత్రం 4 గంలకు నల్గొండ పట్టణం చేరుకొని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సా. 5 గంటలకు నల్గొండ నుంచి బయలుదేరి రా. 7 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.
Somu Veerraju: కేంద్రం సహకారంతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోంది..