భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45…
తాజాగా ఓ పాఠశాలలో కొందరు బాలికలు గొడవ పడుతున్న సమయంలో ఓ బాలిక ముఖంపై బ్లేడుతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఘటన ఢిల్లీలోని గులాబీ బాగ్ టైప్-1 CO-ED సర్వోదయ పాఠశాలలో జరిగింది. ఈ వీడియోని గమనించినట్లయితే.. కొందరు విద్యార్థులు ఒకచోట గుంపుగా ఏర్పడి ఘర్షణ పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే అనుకోకుండా వీరి ఘర్షణలో ఓ అమ్మాయి మరో అమ్మాయి పై బ్లేడ్…
Amit Shah: హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 8 రాష్ట్రాల్లో 16 మందికి పైగా నోటీసులు జారీ చేశారు. వీరిలో హర్యానా సీనియర్ కాంగ్రెస్ నేత కెప్టెన్ అజయ్ యాదవ్ కూడా ఉన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌పై వరుసగా రెండో రోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంపై సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నలు లేవనెత్తింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడంపై సుప్రీంకోర్టు ఈడీని సమాధానం కోరింది.
ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ పార్టీకి షాక్ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కొత్త వివాదంలో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీలో మన్మోహన్ సింగ్‌తో పాటు జమ్మూకశ్మీర్ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ పోస్టర్లు వెలిశాయి.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
Congress: ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షడు అరవిందర్ లవ్లీ సింగ్ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ పరిణామం జరగడంతో కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Congress: లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ లవ్లీ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది.