PM Modi: కాంగ్రెస్ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తుంది.. వక్ఫ్ బోర్డుకు ఆస్తుల అప్పగింతపై ప్రధాని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: 2014 ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వక్ఫ్‌బోర్డుకు ఢిల్లీలోని ప్రధాన భాగాల్లో ఉన్న 123 ఆస్తులను అప్పగించడాన్ని ప్రధాని నరేంద్రమోడీ శనివారం ప్రస్తావించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తుందని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ ఓట్ల కోసం ఆస్తులను వక్ఫ్ బోర్డుకు అప్పగించిందని ఆరోపించారు. 2024 ఎన్నికల సందర్భంగా తొలిసారిగా ఢిల్లీలోని ఎంపీ స్థానాల్లో ప్రధాని ప్రచారం ప్రారంభించారు. ఢిల్లీలో కాంగ్రెస్-ఆప్ కూటమి అవకాశవాదానికి పాల్పడుతున్నాయని, ఒక అవినీతి పార్టీ మరొ అవినీతి పార్టీని కవర్ చేస్తుందని ఈరెండు పార్టీలను ఉద్దేశించి ప్రధాని విమర్శించారు.
ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ తర్వాత ఆయన వారసులు ఎవరు..? అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ప్రధాని మాట్లాడుతూ, తనకు వారసుడు ఉన్నట్లైతే 140 కోట్ల మంది భారతీయుల ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితం చేస్తానని ప్రధాని చెప్పారు. దేశ ప్రజల కోసం, పౌరుల కలలను సాకారం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశానని ప్రధాని ఈశాన్య ఢిల్లీలో జరిగిన ర్యాలీలో అన్నారు.
Also Read
- Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
- Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
- Abhijit Dipke: "రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి".. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
Read Also: Himanta Biswa Sarma: ముస్లిం రిజర్వేషన్లు కావాలంటే పాకిస్తాన్ వెళ్లి ఇవ్వండి..
కాంగ్రెస్-ఆప్ కూటమి ఢిల్లీని నాశనం చేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందని, ప్రజల విశ్వాసాన్ని ఈ రెండు పార్టీల నాయకులు విచ్చిన్నం చేస్తున్నారని ప్రధాని దుయ్యబట్టారు. అవినీతిని రూపుమాపేందుకు రాజకీయాలకు వచ్చామని చెప్పిన వారే వేల కోట్ల రూపాయల కుంభకోణాలకు పాల్పడి జైళ్ల వెంటి తిరుగుతున్నారని సీఎం కేజ్రీవాల్‌ని ఉద్దేశించి ప్రధాని మండిపడ్డారు.
ఆప్ కుంభకోణాలను బయటపెట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ తీసుకోకుండా, తమ నాయకులను ఆప్‌తో బలవంతంగా కలిసి పనిచేయాలని ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోసం “ఓటు జిహాద్” కోసం వాదించే వారితో చేతులు కలిపిందని ప్రధాని మోడీ అన్నారు. ఓటు వేస్తామనే హామీతో దేశ ప్రజల ఆస్తుల్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించిందని కాంగ్రెస్‌పై ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 పునరుద్ధరణ మరియు భారతదేశం యొక్క అణు బాంబుల రద్దుకు ప్రతిపక్ష కూటమి మద్దతు ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ.. పవన్ కల్యాణ్ సహా జనసేన మంత్రుల డుమ్మా..
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!