Budget 2024: ఈ బడ్జెట్ లో రైల్వే టికెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీ లభించేనా..?
- రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
- రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం
- సాధారణ బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఊరట లభించేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ రైల్వేను దేశానికి గుండె చప్పుడు అంటారు. రోజూ లక్షలాది మంది రైలులో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైల్వేపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రైల్వేకు కేటాయింపులు పెంచే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అటువంటి పరిస్థితిలో.. ఈ సాధారణ బడ్జెట్‌లో ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు పెద్ద ఊరటనిస్తుందని భావిస్తున్నారు. రైలు టిక్కెట్లపై వారికి ఇచ్చిన 50 శాతం రాయితీని పునరుద్ధరించవచ్చునని అభిప్రాయపడుతున్నారు. కోవిడ్‌కు ముందు ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. రైలు టిక్కెట్‌లపై సీనియర్ పురుష సీనియర్ సిటిజన్లు రైలు టికెట్లపై 40 శాతం వరకు రాయితీని పొందేవారు. మహిళా సీనియర్ సిటిజన్లకు టిక్కెట్‌లపై 50 శాతం రాయితీ ఉండేది. 2019 చివరి వరకు.. 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్‌లకు ఛార్జీల రాయితీలను అందించింది. రాజధాని రైలులో మొదటి ఏసీ టికెట్ ధర రూ. 4,000 అయితే.. సీనియర్ సిటిజన్లకు ఇది కేవలం రూ.2,000 లేదా రూ. 2,300 మాత్రమే లభించేది.
READ MORE: Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
2019 చివరి నుంచి కోవిడ్ మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో.. రైలు సేవలు నిలిచిపోయాయి. తరువాత వాటిని పునరుద్ధరించారు. కానీ తక్కువ ప్రయాణీకుల ప్రయాణం కారణంగా.. రైల్వే భారీ నష్టాలను చవిచూసింది. దీంతో రైలు టికెట్లపై సీనియర్ సిటిజన్‌లకు భారత రైల్వే రాయితీని నిలిపేసింది. కొవిడ్ పరిస్థితిలో నష్టాల కారణంగా కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వే శాఖ మళ్లీ రాయితీని పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. తమకు ఎలాగైనా రాయితీ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!