ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ట్రయల్ కోర్టు పొడిగించింది. జూలై 15 వరకు రిమాండ్ పొడిగిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలో ఏపీ పునర్నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి సరిదిద్ద లేనంత నష్టం జరిగిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని బాగు చేస్తుందని అన్నారు. ఏపీ గ్లోబల్ లీడర్ గా తయారు చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
భారత్ నుంచి ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వెళ్తున్న క్రీడాకారులకు ప్రధాని మోడీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీని క్రీడాకారులు కలిశారు. ప్రధానితో గ్రూప్ ఫొటోలు దిగారు.
ఢిల్లీ నుంచి ముంబై వస్తున్న భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ నెలకొంది. ఢిల్లీ నుంచి ముంబైకి భారత ఆటగాళ్లు వచ్చే విమానానికి విస్తార ఎయిర్లైన్స్ UK 1845 నెంబర్ ను కేటాయించింది.
బీజేపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఢిల్లీలోని అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం రాత్రి అస్వస్థత కారణంగా ఆస్పత్రిలో చేరారు. నిన్నటి నుంచి అద్వానీ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్ లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలు అందించారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గురువారం ఢిల్లీలోని జీటీబీ నగర్ చేరుకున్నారు. అక్కడ రోజువారీ కూలీలను కలిశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు ఏం పనిచేస్తారో తెలుసుకున్న రాహుల్ మెటీరియల్ ఎక్కడ నుంచి తీసుకొస్తారని అడిగారు.
CM Chandrababu Meets PM Modi: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు. Also Read: Kalki…
AP CM Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ…