రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు డిసెంబర్ 4, 5 తేదీల్లో పుతిన్ భారతదేశంలో పర్యటించనున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ జరుగుతుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: ‘ఢిల్లీ పొల్యూషన్’పై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. రాహుల్‌గాంధీ డిమాండ్
ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటిస్తున్నట్లుగా రష్యా వార్త సంస్థ క్రెమ్లిన్ శుక్రవారం తెలిపింది. ఈ మేరకు తాజాగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అధికారిక ప్రకటనలో ధృవీకరించింది.
ఇది కూడా చదవండి: Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
ఇక పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలో ప్రధాని మోడీతో చర్చలు జరుపుతారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. పుతిన్‌కు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. అధ్యక్షుడు గౌరవార్థం ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మోడీతో పాటు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.
పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ సమావేశం జరుగుతుందని పేర్కొంది. ఇరు దేశాల సహాయ సహకారాలపై దిశానిర్దేశం చేసుకుంటాయని వెల్లడించింది. రెండు దేశాల పురోగతికి ప్రయోజనం చేకూరుస్తాయని తెలిపింది.
At the invitation of Prime Minister Narendra Modi, President of the Russian Federation Vladimir Putin will pay a State visit to India from 04 – 05 December 2025 for the 23rd India-Russia Annual Summit. During the visit, President Putin will hold talks with Prime Minister Narendra… pic.twitter.com/EHmRqtxw9e
— ANI (@ANI) November 28, 2025