దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్నేహం పేరుతో హోటల్కు పిలిచి సహచర విద్యార్థినిపై ఎంబీబీఎస్ విద్యార్థి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వీడియోలు లీక్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో చేసేదేమీలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఇటీవల చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి దగ్గు సిరప్లే కారణం అంటూ ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు దగ్గు సిరప్పై మార్గదర్శకాలు విడుదల చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రేఖా గుప్తా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో నూతన లిక్కర్ పాలసీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అధికారులతు తీవ్ర కసరత్తు చేస్తోంది.
భారతీయులకు గుడ్న్యూస్ అందింది. భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రత్యక్ష విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఆశ్రమ డైరెక్టర్ స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇక సోదాల్లో నిందితుడికి సంబంధించిన కారును గుర్తించగా.. దానిపై నకిలీ ఎంబసీ ప్లేట్లు గుర్తించారు.
ఇరాన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది.
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి పాఠశాలలకు బాంబ్ బెదిరింపులు కలకలం రేపాయి. పలు పాఠశాలలకు శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. తెల్లవారుజామున ఈ బెదిరింపులు రావడంతో పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న 12వ వార్షిక సదస్సుకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరై.. “విజన్ తెలంగాణ – తెలంగాణ రైజింగ్” అంశంపై ప్రసంగించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా వివిధ దేశాల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి…