మణిపూర్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరి, 2026 వరకు రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. మరోసారి కొనసాగించాలంటే పార్లమెంట్ లేదా ఎన్నికల సంఘం ఆమోదం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెయిటీ, కుకి బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకమయ్యారు. ఆదివారం ఢిల్లీలో బీజేపీ హైకమాండ్ పెద్దలతో ఎమ్మె్ల్యేలంతా సమావేశమై ఐక్యతను చాటుకున్నారు. 2023, మే నెల తర్వాత ఇలా ఐక్యంగా కలవడం ఇదే తొలిసారి.

మణిపూర్‌లో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఆదివారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్.సంతోష్‌తో కుకి, మెయిటీ ఎమ్మెల్యేలంతా సమావేశం అయ్యారు. భేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఒక్కటయ్యారు. సమావేశం ఫలవంతమైందని బీఎల్.సంతోష్ ఎక్స్‌లో పేర్కొన్నారు. మణిపూర్‌లో శాంతి, అభివృద్ధి గురించి చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు వచ్చేందుకు ఎమ్మెల్యేలంతా ఒక్కతాటిపైకి వచ్చారని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: H1b visa: హెచ్1 బీ వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచే..!
మొత్తానికి మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయినట్లు కనిపిస్తోంది. ఈ సందేశాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తెలియజేశారు. ఇదిలా ఉంటే గత వారం రాష్ట్రపతి మణిపూర్‌లో పర్యటించారు. ఆ సమయంలోనే కుకి, మెయిటీ నేతలంతా కలిసి చర్చించారు. తాజాగా ఇరు వర్గాల ఎమ్మెల్యేలంతా ఐక్యతను చాటారు. ఈ నేపథ్యంలో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
Held @BJP4Manipur legislature Party meeting today . It was a very fruitful exercise where Peace & Development of the State was discussed .
Everyone resolved to strive hard to bring back normalcy in the state & get the developmental work going at full steam . pic.twitter.com/F1ROZFlv18— B L Santhosh (@blsanthosh) December 14, 2025