ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద స్థాయిలో ఉగ్ర దాడులకు డాక్టర్ల బృందం కుట్ర చేసిందో తెలిసిందే. ఇక డాక్టర్ల నివాసంలో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కొద్దిరోజులుగా కుర్చీ పంచాయితీ నడుస్తోంది. సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. గతంలో హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టినా.. తాజాగా మరోసారి రచ్చ రేపుతోంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం కానుంది. రేపు సాయంత్రం 5:30 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీ బాంబ్ పేలుడిపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో బాంబ్ పేలుడు నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. ఉదయం 11 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది.
ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కోసం భూటాన్ బయల్దేరి వెళ్లారు. మంగళవారం ఉదయం ఢిల్లీ నుంచి భూటాన్‌కు వెళ్లారు. నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లోని థింపులో పర్యటించనున్నారు. భూటాన్ రాయల్ ప్రభుత్వం నిర్వహించే గ్లోబల్ పీస్ ప్రార్థన ఉత్సవంలో మోడీ పాల్గొననున్నారు.
హర్యానాలోని ఫరీదాబాద్‌లో భారీ ఉగ్ర కుట్ర కోణం బయటపడింది. ఒక వైద్యుడి ఇంట్లో 300 కేజీల ఆర్డీఎక్స్, ఒక ఏకే-47 రైఫిల్, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైద్యుడు కాశ్మీర్‌కు చెందిన ముజాహిల్ షకీల్‌గా గుర్తించారు. జమ్మూకాశ్మీర్ ఏటీఎస్ పోలీసుల ఆపరేషన్‌లో ఈ ఉగ్ర కుట్ర బయటపడింది.
బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు.
భారత్-ఆప్ఘనిస్థాన్ మధ్య బంధం మరింత బలపడుతోంది. ఇటీవల ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తా భారత్‌లో పర్యటించారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య బంధం స్ట్రాంగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో తొలి తాలిబన్ దౌత్యవేత్తను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముంబై, ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.9 కోట్ల విలువ చేసే 9 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి ముంబై, ఢిల్లీకి తరలిస్తుండగా ఇద్దరు స్మగ్లర్ల దగ్గర గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.. భారతదేశం లక్ష్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని వ్యాఖ్యానించారు. తాజాగా పాకిస్థాన్-ఆప్ఘనిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చర్చలు విఫలమయ్యాయి.