దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు.
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరు సాగుతోంది. ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఫిబ్రవరి 1న న్యూఢిల్లీలో సీఎం ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ఏపీ సీఎం ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఢిల్లీలో సుమారు 10 లక్షల మంది తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. బురారీ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 12 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు.
Arvind Kejriwal: కోటీశ్వరులు తీసుకున్న రుణాలను నరేంద్ర మోడీ ప్రభుత్వం మాఫీ చేస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. వారి రుణమాఫీని నిషేధించేలా దేశవ్యాప్తంగా ఒక చట్టాన్ని తీసుకు రావాలని ప్రధానికి లేఖ రాశారు ఆయన.
India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…
రాజకీయాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు... ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు..