Delhi Election Results 2025 Live Updates: దేశ రాజధానిలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఆమ్ ఆద్మీ పార్టీ.. ఆ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో భారతీయ జనతా పార్టీ! ఈ రెండింటిలో ఏది పైచేయి కానుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.. మరిన్నీ వివరాల కోసం ఎన్టీవీని చూస్తునే ఉండండి..
ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ, ఆప్ మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ 43 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ కూడా 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఆ ఒక్క స్థానంలో కూడా ఆధిక్యం కోల్పోయింది..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ దూకుడు.. 50 స్థానాల్లో బీజేపీ, 19 స్థానాల్లో ఆప్ లీడ్.. కిందటి ఎన్నికల్లో 8 స్థానాలు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 50 స్థానాల్లో ఆధిక్యం..
ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 8 వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి మనీష్ చౌదరి.. జనక్‌పురి నుంచి బీజేపీ అభ్యర్థి ఆశిష్ సూద్ ముందంజ.. కేజ్రీవాల్, ఆతిశీ, సిసోడియా, సందీప్ దీక్షిత్ వెనుకంజ.. పట్పర్‌గంజ్ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి అవధ్ ఓజా వెనకంజ.. రాజేంద్ర నగర్ నుంచి ఆప్ అభ్యర్థి దుర్గేష్ పాఠక్ లీడ్... ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ 47 స్థానాల్లో ఆధిక్యం.. ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యం.. ఒకే స్థానానికి పరిమితమైన హస్తం..
1500 ఓట్ల వెనకంజలో మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ప్రస్తుతం 45 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.. 24 స్థానాల్లో ఆప్ ఆధిక్యం.. ఒక స్థానంలో కాంగ్రెస్.. కరవాల్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా ఆధిక్యం.. కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ బద్లి నుంచి ముందంజ..
ఎర్లీ ట్రెండ్స్‌లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ.. 40 స్థానాల్లో దూసుకుపోతున్న బీజేపీ.. 25 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజ.. ఒక స్థానంలో కాంగ్రెస్ ఆధిక్యం..
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు..ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ.. న్యూఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్ వెనకంజ.. ప్రస్తుతం 29 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం.. 18 స్థానాల్లో ఆప్ ఆధిక్యం.. ఒక స్థానానికే పరిమితమైన కాంగ్రెస్..
ఢిల్లీ ఎన్నికల్లో సగం సీట్లకు సంబంధించిన తొలి ట్రెండ్స్ వచ్చాయి. పోటీ చాలా ఆసక్తికరంగా మారుతోంది. బీజేపీ 24 స్థానాల్లో, ఆప్ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ ఒక స్థానానికే పరిమితమైంది..
పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో కేజ్రీవాల్, అతిషి, సిసోడియా అందరూ వెనుకబడ్డారు. ఇప్పటివరకు బీజేపీ 18 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 13 స్థానాల్లో ఆధిక్యం.. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యం..
కొనసాగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్.. పోస్టల్ బ్యాలెట్‌లో జంగ్‌పురాలో మనీష్ సిసోడియా వెనుకంజ.. న్యూ ఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనుకంజ.. 14 స్థానాల్లో బీజేపీ ముందంజ- ఆప్-9, కాంగ్రెస్- 1..
ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. బీజేపీకి అనుకూలం.. 5 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీ.. ఒక స్థానంలో ఆప్ ఆధిక్యం.. ఢిల్లీలోని 70 స్థానాల్లో ఓట్ల లెక్కింపు..
ఢిల్లీలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ.. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్.. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 5,000 మంది సిబ్బంది.. మొదట పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు.. తర్వాత ఈవీఎంల కౌంటింగ్.. 70 అసెంబ్లీ స్థానాలు, మ్యాజిక్ ఫిగర్-36..
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉదయాన్ని లేచి.. దేవాలయాలకు పరుగులు తీస్తున్నారు. స్థానిక ఆలయాలకు చేరుకుని దేవీదేవతలను దర్శించుకుంటున్నారు. ఢిల్లీలో బీజేపీ విజయం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆప్ రాజధాని పగ్గాలు దక్కించుకుంటుందని కేజ్రీవాల్ వర్గం ఆశా భావం వ్యక్తం చేస్తోంది. గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేని కాంగ్రెస్ నాయకులు ఈ ఎన్నికలపై ఆశలు పెట్టుకున్నారు.
షాహ్దారా, సెంట్రల్ ఢిల్లీ, తూర్పు, దక్షిణ, నైరుతి జిల్లాల్లో ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నార్త్, వెస్ట్, నార్త్-ఈస్ట్, ఆగ్నేయ జిల్లాల్లో రెండు లెక్కింపు కేంద్రాలు ఉండగా, ఓట్ల లెక్కింపు జరిగే న్యూఢిల్లీ, నార్త్-వెస్ట్ జిల్లాల్లో మూడు లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 5,000 మంది సిబ్బందిని నియమించారు..