ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP) ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
READ MORE: Gold Rates: కంగారు పెట్టేస్తున్న కనకం.. మళ్లీ అదే జోరు.. నేడు తులం ఎంతంటే?
ఈ సందర్భంగా బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి ఎవరు? అనే ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. సీఎం పోస్టుపై కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. “మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేశారు. ఈ విజయం మా అగ్ర నాయకత్వం విజయం అవుతుంది. మేము ఢిల్లీ సమస్యలను లేవనెత్తాం. కానీ అరవింద్ కేజ్రీవాల్ సమస్యల నుంచి దృష్టిని మరల్చే ప్రయత్నం చేశారు. మోసగించే వారికి ప్రజలు ఇలాంటి ఫలితాన్నే ఇస్తారు.” అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వ్యాఖ్యానించారు.
READ MORE:Delhi Election Results : ఢిల్లీ ఫలితాలపై జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా సంచలన ట్వీట్