ఢిల్లీలో తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయనున్నారో నేటితో తేలనుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడే సమయం ఆసన్నమైంది. మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ నిరహిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? లేదా రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల అధికార కరువును అంతం చేస్తుందా? అనే దానిపై అందరి దృష్టి ఉంది. అదే సమయంలో గత రెండు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కూడా ఈ ఎన్నికలపై భారీ ఆశలు పెట్టుకుంది.
READ MORE: Thaman: వివాహ బంధం పై షాకింగ్ కామెంట్స్ చేసిన తమన్..
కాగా.. ఢిల్లీ ఎన్నికల్లో తొలిసారిగా పురుషుల కంటే మహిళలు ఎక్కువ మంది ఓటు వేశారు. మహిళా ఓటర్లు 60.92% ఓటు వేశారు. పురుషులు 60.21% కంటే ఎక్కువ మంది ఓటు వేశారు. అన్ని ప్రధాన పార్టీలు తమ మ్యానిఫెస్టోల్లో మహిళలే లక్ష్యంగా వరాలు జల్లులు కురిపించాయి. మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 అందిస్తామని ఆప్ హామీ ఇచ్చింది. ఆటో, టాక్సీ, ఈ- రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ. లక్ష సాయం, వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా అందిస్తామని వెల్లడించింది. మరోవైపు బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా మహిళలకు రూ.2500 నగదు, సబ్సిడీపై రూ.500కే గ్యాస్ సిలిండర్లు లాంటి కీలక హామీలిచ్చింది. ఇక కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో మహిళలకు రూ.2,500 సాయం చేస్తామని ప్రకటించింది. వంట గ్యాస్ సిలిండర్ రూ.500లకే ఇస్తామని.. అలాగే ఉచిత రేషన్ కిట్ ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో మహిళలు ఎవరికి మద్దతు తెలిపారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
READ MORE: MP News: కోర్టులోనే ముస్లిం వ్యక్తిపై దాడి.. “లవ్ జిహాద్” అంటూ ఆరోపణలు..