Bharat Mobility Global Expo 2025: ప్రతిష్ఠాత్మక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో రెండో ఎడిషన్ను ఈరోజు (జనవరి 17) ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో వాహనాలు, విడిభాగాల ఉత్పత్తులు, టెక్నాలజీ రంగాల్లో 100కు పైగా కొత్త ఆవిష్కరణలు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ కేబినెట్ సంక్రాంతి కానుక అందించింది. ఉద్యోగులందరికీ 8వ వేతన సంఘాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 3 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ ప్రకటించింది. తాజాగా ఇదే అంశంపై బుధవారం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఆప్కు మద్దతు ఇవ్వడానికి గల కారణాలు వెల్లడించారు.
ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భగవత్ పై తీవ్రంగా మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకే వస్తాయన్నారు. దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం కొనసాగుతుందని తెలిపారు. ఒకటి మా రాజ్యాంగ సిద్ధాంతం.. అయితే, మరొకటి ఆర్ఎస్ఎస్ భావజాలం అన్నారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం రాలేదంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ దేశ ప్రజలందరినీ అవమానించారు
Dense Fog: దేశ రాజధాని ఢిల్లీలో పొగ మంచు కప్పేసింది. దట్టమైన పొగ మంచు వల్ల విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో, విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కొనసాగుతుంది. మరోవైపు, ఇప్పటికే ఢిల్లీకి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Congress New Office: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కొత్త భవనాన్ని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఈరోజు (జనవరి 15) 'ఇందిరా భవన్'ను ప్రారంభించనున్నారు.
Delhi Election 2025: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మార్లెనా సింగ్ పై రిటర్నింగ్ అధికారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.