దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ శనివారం జరగనుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఫలితాలకు ముందు అభ్యర్థుల కొనుగోలు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ గాలం వేస్తోందని.. 16 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్ కాల్స్ చేశారని కేజ్రీవాల్, సంజయ్ సింగ్ సంచలన ఆరోపణల చేశారు. ఒక్కొక్కరికి రూ.15 కోట్లు ఇస్తామని బేరం చేశారని.. అంతేకాకుండా మంత్రి పదవులు కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఆరోపణలను పరిశీలించాలంటూ ఏసీబీ అధికారులకు ఎల్జీ వీకే.సక్సేనా ఆదేశించారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఇది కూడా చదవండి: Infosys: ఫ్రెషర్లకు షాక్ ఇచ్చిన ఇన్ఫోసిస్.. 400 మందికిపై వేటు..
తాజాగా ఇదే అంశంపై శుక్రవారం ఆప్ సీనియ్ నేత సంజయ్ సింగ్ స్పందించారు. దేశంలో అత్యంత అవినీతి పార్టీ బీజేపీ అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ ఎప్పుడూ ఇతర పార్టీలను విచ్ఛన్నం చేయాలని చూస్తుంటుందని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూల్చిందో అందరికీ తెలిసిందేనన్నారు. ఆరోపణలపై ఫిర్యాదు చేసి కచ్చితంగా విచారణ కోరతామని స్పష్టం చేశారు. మేము ఆరోపణలు చేశాక.. బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. ఢిల్లీ ఎల్జీ వీకే.సక్సేనాను కలిశారు. అనంతరం ఏసీబీకి ఎల్జీ లేఖ రాశారన్నారు. ఆప్ కూడా ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. కొనుగోలుపై విచారణ కోరతామన్నారు. బీజేపీ నాయకులు సంప్రదించిన.. ఆప్ నాయకుడి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినట్లు సంజయ్ సింగ్ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Sri Murali : పాన్ ఇండియా హిట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం పోలింగ్ జరిగింది. 60 శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ మాత్రం 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారంలోకి రాబోతుందని తెలిపాయి. రేపే ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.
#WATCH | Delhi: AAP MP Sanjay Singh says, "BJP is the most corrupt party in the country. BJP always believes in breaking other parties…BJP toppled governments in Maharashtra, Karnataka, Madhya Pradesh, Uttarakhand, Arunachal Pradesh. Do we need a certificate from them that they… pic.twitter.com/CVrpfWPrBU
— ANI (@ANI) February 7, 2025