India Republic Day: భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ (Kartavya Path)లో ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం మరింత ప్రత్యేకంగా ఉండడంతో త్రివిధ దళాలు సంయుక్తంగా ఒక శకటాన్ని తీసుకురావడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఈ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు…
రాజకీయాలకు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి.. ఈ రోజు భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు... ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.. నా రాజీనామాను ఉపరాష్ట్రపతి ఆమోదించారు.. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానన్న ఆయన.. వైసీపీ అధినేత వైఎస జగన్తో అన్నీ మాట్లాడాకే రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు..
విజయసాయిరెడ్డి.. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ దగ్గరకు వెళ్లకముందే.. ఎంపీ గురుమూర్తి.. సాయిరెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.. రాజీనామా చేయొద్దని సాయి రెడ్డిని కోరాను అని.. కానీ, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు విజయసాయిరెడ్డి చెప్పడంలేదన్నారు.. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సమస్యలు లేవు అని స్పష్టం చేశారు ఎంపీ గురుమూర్తి..
పార్టీ ఆదేశాలతో ఢిల్లీ బయల్దేరారు వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్.. రాజ్యసభ సభ్యత్వానికి విజయ సాయిరెడ్డి రాజీనామా తర్వాత పార్టీ ఆదేశాలు మేరకు ఢిల్లీలో మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. ఒత్తిడితోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తానని చెప్పి ఉండొచ్చన్న ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు బోస్..
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. అధికార-ప్రతిపక్ష నేతల విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇక సమయం తక్కువగా ఉండడంతో అగ్ర నేతలంతా ప్రచారం నిర్వహిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఐదేళ్లలో నిరుద్యోగాన్ని అంతం చేస్తానని ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కేజ్రీవాల్ ఓటర్లను ఉద్దేశించి ఓ వీడియో విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఇండియా బ్రాండ్ అత్యంత పటిష్టంగా ఉందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు . భారతీయుల గోల్డెన్ ఎరా మొదలైందన్నారు.. దావోస్ వేదిక గా భారత్ తరపున నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు... రాజకీయాల్లో వారసత్వం ఉండదని.. చుట్టూ ఉన్న పరిస్థితి వల్ల అవకాశాలు వస్తాయన్నారు చంద్రబాబు.. పెట్టుబడుల కోసం రాష్ట్రాలు పోటీపడినా ఇండియా ఫస్ట్ అన్నదే తమ విధానం అన్నారు..