ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. READ MORE:Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..? ఇదిలా ఉండగా.. దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం…
కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఆతీశీ విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు. ఆయన ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధురిని ఓడించారు.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు.
ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్లు వీఐపీ సీట్లపైనే ఉన్నాయి. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ స్థానం అత్యంత ముఖ్యమైన స్థానం. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మధ్య గట్టి పోటీ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ నుంచి…
ఢిల్లీ ఎన్నికల ఎర్లీ ట్రెండ్స్ చూస్తే.. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా కనిపిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఉదయం 10 గంటల వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. బీజేపీ 38 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. 2020 ఢిల్లీ అల్లర్ల వల్ల ప్రభావితమైన, ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషించే అసెంబ్లీ స్థానాల ఫలితాలపై అందరి దృష్టి ఉంది. ఇదిలా ఉండగా.. గత రెండు ఎన్నికల్లో…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 2025 ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం..ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కంటే భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు అందిన ట్రెండ్స్ ప్రకారం.. భారతీయ జనతా పార్టీ (BJP) ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయం ఆసన్నమైంది. ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రారంభ ట్రెండ్స్‌లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ కూడా గట్టి పోటీ ఇస్తోంది. చాలా మంది సీనియర్ ఆప్ నాయకులు వెనుకబడి ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉండగా, మెజారిటీకి 36 సీట్లు అవసరం ఉంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వరుసగా మూడోసారి గెలుస్తుందా? రాజధానిలో బీజేపీ 27 ఏళ్ల తర్వాత వికసిస్తోందా? అనేది తేలనుంది. అదే…
రోహిణి అసెంబ్లీ స్థానానికి తొలి రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. ఆప్ అభ్యర్థి ప్రదీప్ మిట్టల్ కు 3235 ఓట్లు, బీజేపీ అభ్యర్థి విజేంద్ర గుప్తా కు 3187 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సుమేష్ కు 177 ఓట్లు వచ్చాయి. 48 ఓట్ల ఆధిక్యంలో ఆప్ అభ్యర్థి కొనసాగుతున్నారు.
ఢిల్లీలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది.. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తోంది.. ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది. బీజేపీ 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాల్లో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. READ MORE: Saurabh Bharadwaj: ఆప్‌ని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది.. మరోవైపు ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో 70 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది..…