నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. తొలి విడత జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. ఇక రెండో విడత మార్చి 9 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తొలిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇక ఎనిమిదోసారి నిరలమ్మ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు.
ఇది కూడా చదవండి: Arijith Singh : మ్యూజిక్ లవర్స్‌కి బ్యాడ్ న్యూస్.. సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అర్జిత్ సింగ్!
ఇక ఈ సమావేశాలు కూడా హాట్‌హాట్‌గా జరిగేటట్టు కనిపిస్తున్నాయి. గత వర్షాకాల, శీతాకాల సమావేశాలు ‘సర్’ వ్యవహారం కుదిపేసింది. అయితే గత శీతాకాల సమావేశాల్లో ఉపాధి హామీ పథకం పేరును ‘‘జీ రామ్ జీ’గా కేంద్రం మార్చింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఈ వ్యవహారం దుమారం రేపే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Off The Road: కృష్ణా జిల్లా టీడీపీలో కులాల కుంపట్లు రగులుతున్నాయా ?
సమావేశాలు సజావుగా జరిగేందుకు కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులంత హాజరయ్యారు.