దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కురుస్తున్నాయి. ఇంకొన్ని రాష్ట్రాల్లో మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఇది కూడా చదవండి: US: భారత్-ఈయూ ఒప్పందం వేళ అమెరికా షాక్.. డీల్‌పై హాట్ కామెంట్స్
దేశ రాజధాని ఢిల్లీలో పాటు ఉత్తర భారత్‌లో పలు చోట్ల వడగళ్లు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మెరుపులు, వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. ఇక గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు ఉంటాయని స్పష్టం చేసింది. వాయువ్య భారతదేశంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో బలమైన గాలులు.. వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఇది కూడా చదవండి: Rajinikanth: 5 రూపాయల పరోటా వెనుక సూపర్ స్టార్ కథ.. అభిమాని చేసిన పనికి రజినీ ఫిదా!
ఇక ఉత్తరఖాండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో హిమపాతం ఎక్కువగా ఉంటుందని సూచించింది. హిమాలయ ప్రాంతంలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమపాతంతో పాటు భారీ వడగళ్ల తుఫాన్ ఉండొచ్చని తెలిపింది. గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు ఉంటాయని పేర్కొంది.
ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో గత కొన్ని రోజులుగా మంచు తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. చక్రతా, ఔలి, కేధార్‌నాథ్, బద్రీనాథ్‌తో సహా ఉత్తరాఖండ్‌లో పలు ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా, మనాలిలో మంచు తుఫాన్ కారణంగా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.