దేశ వ్యాప్తంగా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మువ్వెన్నల జెండా రెపరెపలాడుతోంది. ఇక రిపబ్లిక్ డే సందర్భంగా వాహనదారులకు ఆయిల్ సంస్థలు శుభవార్త చెప్పాయి.
ఇండియన్ ఆయిల్ వైబ్‌సైట్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పెట్రోల్ ధర 22 పైసలు తగ్గింది. దీంతో లీటర్ రూ.94.90 దగ్గర అమ్ముడవుతోంది. ఇతర నగరాల్లో కూడా ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ముంబై సహా పలు నగరాల్లో తగ్గాయి. పెట్రోల్ 22 నుంచి 26 పైసలు తగ్గగా.. డీజిల్ ధరలు కూడా 30 పైసలు వరకు తగ్గాయి.
ఎక్కడెక్కడ తగ్గాయంటే…
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 22 నుంచి 26 పైసలు తగ్గాయి. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.94.90కి అమ్ముడవుతోంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో డీజిల్ ధర 28 పైసలు తగ్గింది. బీహార్ రాజధాని పాట్నాలో పెట్రోల్ 12 పైసలు తగ్గి లీటర్‌కు రూ.105.58కి చేరుకుంది.
పెట్రోల్..
ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ. 94.72
ముంబైలో పెట్రోల్ లీటరుకు రూ.103.44
చెన్నైలో పెట్రోల్ లీటరుకు రూ.100.76
కోల్‌కతాలో పెట్రోల్ లీటరుకు రూ.104.95
నోయిడాలో పెట్రోల్ లీటరుకు రూ. 94.90
ఘజియాబాద్‌లో పెట్రోల్ లీటరుకు రూ. 94.75
పాట్నాలో పెట్రోల్ లీటరుకు రూ.105.58
డీజిల్..
ఢిల్లీలో డీజిల్ ధర లీటరుకు రూ. 87.62
ముంబైలో డీజిల్ ధర లీటరుకు రూ. 89.97
చెన్నైలో డీజిల్ ధర లీటరుకు రూ. 92.35
కోల్‌కతాలో డీజిల్ లీటరుకు రూ. 91.76
నోయిడాలో డీజిల్ లీటరుకు రూ. 88.01
ఘజియాబాద్‌లో డీజిల్ లీటరుకు రూ. 87.86
పాట్నాలో డీజిల్ ధర లీటరుకు రూ. 91.82