వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం వాటిల్లిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై రాజ్య సభలో ఎంపీ ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. వెయ్యి కోట్ల వరద సాయం ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలలకు తీవ్రంగా నష్టం జరిగిందని, పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగిందని చెప్పారు. రోడ్లు, వంతెనలు, విద్యుత్ స్తంభాలు, కొట్టుకుపోయాయని సభకు తెలిపారు. వరదల్లో 44 మంది…
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రిస్క్ అధికంగా ఉన్న దేశాలనుంచి వచ్చే ప్రయాణికలపై కొత్త రూల్స్‌ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఈరోజు అర్థరాత్రి నుంచి కొత్త రూల్స్ అమలు కాబోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిగిరి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమానం చార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ నుంచి యూకే, యూఎస్,…
ఎమ్ఎస్పీ (కనీస మద్దతు ధర)పై కేంద్ర కమిటీకి ప్రతిపాదించాల్సిన పేర్లను చర్చించేందుకు పంజాబ్‌కు చెందిన 32 మంది రైతుల సంఘాలు సోనేపట్-కుండ్లీ సరిహద్దులో సమావేశం నిర్వహించాయి.కేంద్ర ప్రభుత్వం సంయుక్త కిసాన్ మోర్చా (SKM)ని కమిటీలో చర్చించేందుకు ఐదుగురు రైతు నాయకుల పేర్లను సమర్పించాలని కోరింది. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన తర్వాతఈ చర్చల కోసం కార్యచరణ ప్రారంభం అయింది. వివాదాస్పద చట్టాన్ని రద్దు చేసే బిల్లును…
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాల నుంచి వచ్చే విమానాలను నిలిపివేయాలని ప్రధాని మోడీని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఒమిక్రాన్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు పరీక్షలు నిర్వహించాలనే నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందులో భాగంగానే ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల కోసం నిలబడాల్సిన ప్రయాణీకుల కోసం విమానాశ్రయంలో కుర్చీలను వరుసగా హోల్డింగ్ ఏరియాలలో ఏర్పాటు…
ప్రపంచ దేశాలను ఒమిక్రాన్ వేరియంట్ కరోనా మహమ్మారి ఇప్పుడు టెన్షన్ పెడుతోంది.. దీంతో అప్రమత్తమైన కేంద్రం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.. ఇక, ఈ కొత్త వేరియంట్‌పై రాజ్యసభలో క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ.. భారత్‌లో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదు కాలేదని స్పష్టం చేశారు.. ప్రశ్నోత్తరాల సమయంలో రాజ్యసభలో మాట్లాడిన ఆయన… ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.. ఎయిర్‌పోర్ట్‌ల వద్ద స్క్రీనింగ్ చేస్తున్నామని, పాజిటివ్…
దేశ రాజధాని ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ ర్యాలీకి సిద్ధం అవుతోంది కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో దేశంలో పెరుగుతోన్న ఇంధన ధరలు, ద్రవ్యోల్బణాన్ని వ్యతిరేకిస్తూ ‘జన జాగరణ్ అభియాన్’ పేరుతో కాంగ్రెస్ మెగా ర్యాలీని చేపట్టనుంది. పెరిగిన ధరలకు నిరసనగా నవంబర్ 14 నుంచి 29 వరకు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ “జనజాగరణ్ అభియాన్” నిర్వహించింది.. ఇక, దానికి ముగింపుగా ఢిల్లీలో డిసెంబర్ 12వ తేదీన భారీ ర్యాలీ ఉంటుందని ప్రకటించింది..…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలిరోజే రచ్చతో మొదలయ్యాయి… ప్రతిపక్షాల ఆందోళనలతో సభ ప్రారంభమైన వెంటనే గంట పాటు వాయిదా వేశారు లోక్‌సభ స్పీకర్.. మరోవైపు రాజ్యసభలోనూ ఇలాంటి పరిస్థితే రిపీట్ అయ్యింది.. అయితే, దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చలు జరగాలని ఆకాక్షించారు ప్రధాని నరేంద్ర మోడీ.. రాజ్యాంగ దినోత్సవం స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించిన ఆయన.. ప్రతీ ప్రశ్నకు జవాబిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముందు మీడియాతో మాట్లాడిన…
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…
ఆశతో హస్తినకు వచ్చాం.. కానీ, కేంద్ర ప్రభుత్వం నిరాశపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి… కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. యాసంగిలో వరి వేయొద్దని కేంద్రం గట్టిగా చెప్పిందని తెలిపారు. మేం ఎంతో ఆశతో వచ్చాం.. కానీ, కేంద్రం నిరాశపరిచిందన్న ఆయన.. కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశించాం.. కానీ, నిరాశే మిగిలిందన్నారు. కేంద్రమంత్రితో జరిగిన సమావేశంలో.. కేంద్రం ఎంత…