ఢిల్లీ శివారులో సుదీర్ఘ కాలంగా సాగుతోన్న రైతు సంఘాల ఆందోళన తాత్కాలికంగా వాయిదా పడింది.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంతో పాటు.. రైతుల ఇతర డిమాండ్లపై కూడా సానుకూలంగా ఉండడం.. కనీస మద్దతు ధరపై పాజిటివ్‌గా ఉండడంతో.. ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. కనీస మద్దతు ధరపై కేంద్రం నుంచి లేఖ వచ్చిందన్నారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… ఇక, ఆందోళనల సందర్భంగా రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని లేఖలో ఉందని…
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ఆందోళనకు ఏడాది దాటింది.. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలతో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ దిగివచ్చారు.. రైతులకు క్షమాపణలు చెప్పి.. కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు.. అయితే, మరికొన్ని డిమాండ్ల సాధన కోసం రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.. కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే ఆందోళన విరమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.. తమ భవిష్యత్తు కార్యాచరణపై…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి ఉపరితల గని వలన వ్యవసాయ భూములు కోల్పోయిన తమకు సింగరేణి సంస్థ నష్టపరిహారం చెల్లించడం లేదని కొంతకాలంగా ప్రజాప్రతినిధులు అధికారులను ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా న్యాయం జరగడం లేదని బాధితుడు సుందర్ తో పాటు కుటుంబం నిరసనలు వ్యక్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని న్యాయం కోసం ప్రధానిని కలిసేందుకు సుందర్ కుమారుడు సంజయ్ ఆరు రోజులు బైక్ పై ప్రయాణించి ఢిల్లీ చేరుకున్నాడు. గతంలో ఎడ్లబండి మీద…
2021 నవంబర్ 21 నాటి ప్రధాన మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్న అంశాలపై చర్చించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ అందలేదని ఎస్‌కెఎం పేర్కొంది. అటువంటి పరిస్థితిలో భవిష్యత్ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలిపింది. ఈ నెల 7న సింఘూ సరిహద్దు వద్ద ఎస్‌కెఎం సమావేశం అవుతుందని, భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. ఏడాదిగా రైతు ఉద్యమానికి నిరంతరం మద్దతు ఇస్తున్న ఢిల్లీ సరిహద్దుల సమీపంలో నివసిస్తున్న…
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు.. ఈ రోజు కూడా దాన్యం సేకరణ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉభయ సభల్లో ఆందోళన చేపట్టనున్నారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వరుసగా లోక్‌సభ, రాజ్యసభలో రైతుల సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేస్తున్న ఎంపీలు.. ఇవాళ సమావేశాలను బహిష్కరించనున్నారు.. Read Also: ఇక అలా కుదరదు..! వర్క్ ఫ్రమ్ హోంపై…
ఖరగపూర్, విజయవాడ (1,115 కి.మీ), విజయవాడ-నాగపూర్(975కి.మీ)ల మధ్య “డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్” నిర్మాణం కోసం రైల్వే శాఖ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ “నేషనల్ మినరల్ పాలసీ” కింద “డెడికేటెడ్ మినరల్ కారిడార్లు” ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. మైనింగ్ చేసే ప్రాంతాల నుంచి ఖనిజాలను ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఈ కారిడార్లు ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. “మినరల్…
తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బీజేపీ.. వివిధ పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.. ఇందులో భాగంగా ఇవాళ బీజేపీ గూటికి చేరారు టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్, పలువురు నాయకులు.. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ చుగ్ , కేంద్ర మంత్రి నఖ్వి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు చింతలగట్టు విఠల్.. పార్టీ సభ్యత్వ నమోదు పత్రాన్ని అందించి,…
యాసంగిలో వరి ధాన్యం సేకరణపై స్పష్టతను ఇవ్వాలని లోక్‌సభలో ఆందోళన చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు ఈ రోజు సమావేశాల్లో కేంద్రం తీరును నిరసిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. జాతీయ ధాన్యం సేకరణ విధానం, మద్దతు ధరకు చట్టబద్ధతను కల్పించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభం అయిన వెంటనే కేంద్రం వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఈ అంశంపై చర్చించాలంటూ ఎంపీ నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. టీఆర్ఎస్ ఎంపీల…
రైతు సమస్యలపై పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేస్తూ వస్తోంది టీఆర్ఎస్ పార్టీ… ముఖ్యంగా తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది.. ఇక, తెలంగాణ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఉభయసభల నుంచి ఇవాళ వాకౌట్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఇవాళ ఆరో రోజు కూడా ఉభయ సభల్లో ఆందోళన కొనసాగించారు టీఆర్ఎస్ ఎంపీలు.. లోకసభలో స్పీకర్ పోడియాన్ని…