కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్, సోనిపట్ ఝజ్జర్‌లోని అన్ని పాఠశాలలను నవంబర్ 17 వరకు మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థలు చెత్త ను కాల్చడాన్ని కూడా నిషేధించింది. వాయు కాలుష్యం కార ణంగా నవంబర్ 15 నుండి ఒక వారం పాటు పాఠశాలలను మూసివే యాలని ఢిల్లీ ప్రభుత్వం కోరిన ఒక రోజు తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యమునా…
నటుడు సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ నున్నట్టు ఆదివారం ప్రకటించారు. అయితే ఆమె ఏ పార్టీలో చేరుతు న్నారనే విషయంపై స్పష్టత లేదు. సరైన సమయంలో దీనికి సంబం ధించిన ప్రకటనను విడుదల చేస్తామని సోనూసూద్ వెల్లడించారు. మోగాలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటనను చేశారు. సోనూసూద్ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్ సీఎం…
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితంపై తెలంగాణ ప్రజలు మొత్తం ఉత్కంఠగా ఎదురుచూశారు.. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే, పార్టీ మారిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అయితే, అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరా జరిగినా.. ఈటలకు భారీ మెజార్టీయే దక్కింది.. అయితే, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే టార్గెట్‌గా చెబుతున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ బై పోల్‌లో చతికిలపడిపోయింది.. అయితే, గత ఎన్నికల్లో 60…
విద్యుత్ కష్టాలు, అదనపు భారం నుంచి టీటీడీ బయటపడే మార్గాలు వెతుకుతోంది. ఢిల్లీలోని టీటీడీ శ్రీవెంకటేశ్వర కాలేజీలో సోలార్ ప్లాంట్ ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. 139 కేవీఏ సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటయింది. టీటీడీ కళాశాలలో ఇప్పటి వరకు యూనిట్ విద్యుత్‌కు రూ. 11.50 చెల్లిస్తున్నామని, ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్‌తో యూనిట్ ఖర్చు రూ. 3.33కు తగ్గిందన్నారు. మొత్తంగా కళాశాలపై విద్యుత్తు బిల్లుల భారం నెలకు రూ. లక్షకు పైగా తగ్గింది. కళాశాల భవనాల…
షెడ్యూలింగ్ కారణాలను” పేర్కొంటూ, యుద్ధంతో దెబ్బతిన్న ఆప్ఘాన్ దేశ పరిస్థితులపై భారతదేశం నిర్వహించిన ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేష న్నుకు చైనా గైర్హాజరైంది. దాని మిత్ర దేశమైన పాకిస్తాన్ ఏర్పాటు చేసిన సమావేశానికి చైనా హాజరైయింది.దీంతో డ్రాగన్ ఆడుతున్న డ్రామాలు మరోసారి బయట పడ్డాయి. ఈ విషయం పై ఇప్పటికే భారత్ చైనాను వివరణ కోరింది. పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితిని చర్చించడానికి ఇస్లామా బాద్‌లో అమెరికా, చైనా,రష్యాలకు చెందిన సీనియర్ దౌత్య వేత్తలకు పాకిస్తాన్ గురువారం ఆతిథ్యం…
యమునా నది విషపు నురుగుతో పోరాడుతుంది. యమునా నదిలో నడుము లోతు వరకు విషపూరితమైన నురుగుతో నిలబడిన భక్తుల షాకింగ్ చిత్రాలు, వీడియోలు ప్రతి సంవత్సరం ముఖ్యాంశాలుగా మారుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా ఏం లేదు. సోమవారం, కలుషితమైన నదిలో మహిళలు కార్వా చౌత్ సంద ర్భంగా స్నానం చేస్తున్న అనేక క్లిప్‌లు ఇంటర్నెట్లో హల్ చల్ చేశా యి. అయితే, ఈ ఏడాది విషపూరిత నురుగు సమస్యకు ఢిల్లీ జల్ బోర్డు…
ఆఫ్ఘన్ భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించకూడదని ఎనిమిది దేశాలు ఆమోదించిన ఉమ్మడి ప్రకటనను అజిత్ ధోవల్ బుధవారం విడుదల చేశారు. న్యూ ఢిల్లీలో జరిగిన ఆఫ్ఘనిస్తాన్పై మూడవ ప్రాంతీయ భద్రతా సంభాషణలో భాగంగా 7 దేశాల NSAలు ప్రకటనను ఆమోదించాయి. జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ ధోవల్ ప్రాతినిథ్యం వహించిన సెక్యూరిటీ ఆన్ ఆప్ఘాన్ డైలాగ్ డిక్లరేషన్ లో ఇరాన్, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్థాన్‌లు పాల్గొన్నాయి. చర్చల్లో చేరాల్సిందిగా చైనా, పాకిస్థాన్‌లను…
గత కొన్ని రోజులుగా, ఢిల్లీలో ఉష్ణోగ్రత తగ్గింది, కానీ ఖచ్చితంగా మంచు కురిసేంత చలి లేదు! ఢిల్లీలోని యమునా నదిలో తేలియాడే మంచులా కనిపించే తెల్లటి పదార్థంతో యుమునా నది అంతా పూత పూసిట్టు ఉంది. కానీ ఇది మంచు కాదు. ఇది నీటి కాలుష్యం ఫలి తంగా నదిని కప్పి ఉంచిన విషపూరిత నురుగు. పరిశ్రమలు, కర్మాగా రాల నుండి విడుదలయ్యే కాలుష్యం నదిలో అమ్మోనియా స్థాయి 3 పార్ట్స్ ఫర్ మిలియన్‌కు పెరగడం వల్ల…
దేశరాజధాని ఢిల్లీకి నీటి కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతుంటే ఇప్పుడు నీటి సరఫరా బంద్ కావ డంతో మరిన్ని కష్టాలు ఢిల్లీ వాసులును వెంటాడుతున్నాయి. ఇప్ప టికే పెరిగిన కాలుష్యంతో నగర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతు న్నారు. దీంతో పాటు శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. యమునా నది తీరంలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగి పోవడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపో యింది. ఈ నది నీటిలో…
నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరగనుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో ప్రారంభమయ్యే బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంతో ముగియనుంది. పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. కోవిడ్19 నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ సమావేశానికి జాతీయ కార్యవర్గ సభ్యులందరినీ ఢిల్లీకి ఆహ్వానించలేదు.…