బొగ్గు గనుల వేలానికి వ్యతిరేకంగా సింగరేణి కార్మికులు మూడు రోజుల సమ్మెపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పార్లమెంట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ర్ట ప్రభుత్వ ప్రయోజనాల కోసమే ఈ సమ్మె కొనసాగిందని పార్లమెంట్‌లో ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపి వాటిని సింగరేణి సంస్థకు అప్పగించాలని సోమవారం లోక్‌సభలో జీర్ అవర్‌లో అత్యవసర ప్రజాప్రయోజనాల అంశం కింద కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన డిమాండ్‌పై ప్రహ్లాద్ జోషి ఈ వ్యాఖ్యలను చేశారు.
ఇప్పుడు వేలం పద్ధతి ప్రారంభమైంది. ఇది విధాన నిర్ణయం యూపీయే హయాంలో బొగ్గు గనులపై సుప్రీంకోర్టు చెప్పిన అంశాలు అందరికి తెలుసు ఇంతకముందు రాష్ర్టాలకు గనులు కేటాయించి ఉండొచ్చు. ఇప్పుడు ఆ పని చేయలేం. మేం ఏకపక్షంగా ఏం చేయడం లేదని, ఒకవేళ బొగ్గు గనులు కేటాయించినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వాలకు బహిరంగ నోటీసు ఇస్తామన్నారు. సింగరేణిలో సమ్మె జరగడం దురదృష్టకర సంఘటన. సంబంధిత మంత్రి అధికారులతో మాట్లాడితే సరిపోయేదన్నారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డి చేసిన ప్రకటన వాస్తవాల ఆధారంగా లేదని ప్రహ్లాద్ జోషి అన్నారు.
Also read:కాళేశ్వరం ముంపుపై 8వారాల్లో నివేదిక ఇవ్వండి: NHRC
అంతక ముందు సభలో ఉత్తమ్ మాట్లాడుతూ.. సత్తుపల్లి, కొత్తగూడెం, కళ్యాణఖని, శ్రావణపల్లి బ్లాకులు సింగరేణిని ఆనుకునే ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడుకు బొగ్గు అవసరం ఉందని అందువల్ల వేలం రద్దు చేసి వాటిని సింగరేణికి అప్పగించాలని కోరారు. మంత్రి పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో సింగరేణి సమ్మె కేంద్ర ప్రభుత్వం వైఖరిలో ఎలాంటి మార్పు తీసుకురాలేదని తెలుస్తోంది.