పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ బీసీ జనగణన అంశం పై మాట్లాడారు. బీసీల సమస్యలను సభకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..బీసీలు బలహీన వర్గాలకు చెందిన వారే.. కానీ బలహీనులు కాదన్నారు. బీసీలకు కేటాయించే బడ్జెట్ సరిపోవడం లేదన్నారు. సామాజిక వెనకబాటు ఉన్న వారికి రిజ్వేషన్లు అందేలా కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలన్నారు.
Also Read: సుప్రీం కోర్టు రీజినల్ బెంచ్‌లను ఏర్పాటు చేయాలి: వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
భారత దేశంలో నాలుగు కులాలు తప్ప అందరినీ రిజర్వేషన్లో చేర్చాలని ఆయన కోరారు. రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశం, రాజ్యాంగం స్ఫూర్తి అని అన్నారు. వెనుకబడిన వర్గాల వారు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నదే రాజ్యాంగ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. అయితే దాన్ని కొందరూ తప్పుదోవ పాటించేలా చూస్తున్నారన్నారు. జనగణనలో కుల గణన కూడా చేయాలని డిమాండ్ చేస్తున్నామని పిల్లి సుభాష్ సభకు వివరించారు.