ప్రేమ.. ఎంతటివారినైనా మార్చేస్తుంది.. దానికి వయస్సు తో పనిలేదు.. ఆస్తి అంతస్తు చూడదు.. చివరికి లింగ బేధం కూడా అడ్డురాదు.. అదే ప్రేమలో ఉన్న మాయ.. కానీ కొంతమంది మాత్రం ప్రేమ పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు.. వారి అవసరాలకు వాడుకొని వదిలేస్తున్నారు. తాజాగా ఒక అబ్బాయి మరో అబ్బాయిని ప్రేమ పేరుతో నమ్మించి అతడిని అమ్మాయిలా మార్చి అతడి కోరిక తీర్చుకొని వదిలేసి వెళ్లిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల కుర్రాడికి, ఢిల్లీకి చెందిన 24 ఏళ్ల కుర్రాడికి ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.. కొద్దిరోజుల్లోనే ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. తాను లేకపోది ఉండలేనని ఢిల్లీ యువకుడు చెప్పడంతో మహారాష్ట్ర యువకుడు.. ముందు వెనుక చూడకుండా ఆపరేషన్ ద్వారా తన లింగాన్ని మార్చుకుని అమ్మాయిగా మారాడు. ఇంకేముంది అమ్మాయిగా ఢిల్లీలో అడుగుపెట్టి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. కొద్దిరోజులు ఒకే ఇంట్లో ఉన్న ఆమెతో, ఆ యువకుడు కామ కోరికలను తీర్చుకొన్నాడు. అనంతరం ఆమెను అక్కడే వదిలి పరారయ్యాడు. ఎన్నిరోజులైనా తిరిగి ప్రియుడు రాకపోవడంతో ఆమె మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.